Home » Hyderabad
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శాంతి భద్రతలు, ట్రాఫిక్ వంటి కీలక అంశాల్లో కమిషనరేట్లు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు సమావేశమయ్యారు.
హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో వార్డుల సంఖ్య పెంచి సరిహద్దులు మార్చుతున్నారు. దీనిపై అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. నేటితో (డిసెంబర్ 17)తో ముగిసే అభ్యంతరాల సమర్పణ గడువును మరో రెండు రోజులు పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది.
ప్రతి ఏడాది రాష్ట్రపతి హోదాలో ఉన్నవారు శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రావడం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాలం విడిది కోసం హైదరాబాద్‌కు విచ్చేశారు. సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలను చూసి కాంగ్రెస్ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యిందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. మూడో దశ ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీనీ నిరాశపరచక తప్పదని అన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో 16 మంది మావోయిస్టుల అరెస్ట్‌ను తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ సంచలన లేఖను విడుదల చేసింది.
అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డిల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ తుది తీర్పు ప్రకటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో స్పీకర్ తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామ హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. తన హెల్త్ బీమా పాలసీకి సంబంధించి క్లెయిమ్ విషయంలో కంపెనీ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఈ కేసు వేశారు.
తెలుగు ఇండస్ట్రీకి పైరసీ ద్వారా నష్టం తీసుకువస్తున్నాడని బోడపాటి రవికుమార్ అలియాస్ ఐబొమ్మ రవి పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
సాధారణంగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో తరుచూ వాడీ వేడీ చర్చలు జరుగుతుంటాయి. సభ్యుల మధ్య వాగ్వాదాలు తారాస్థాయికి చేరి ఆందోళన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో వార్డుల డీలిమిటేషన్ అంశంపై చర్చలు జరుగుతున్నాయి.
యూరియాను బ్లాక్‌లో పరిశ్రమల అవసరాలకు తరలిస్తున్నారనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయని మంత్రి తుమ్మల తెలిపారు. యూరియా పక్కదారి పట్టకుండా నేరుగా రైతులకు అందే విధంగా మొబైల్ యాప్ పనిచేస్తుందని తెలిపారు.