తనకంటే 10 ఏళ్ల చిన్నోడితో మహిళ స్నేహం.. జోడీగా దొంగతనాలు..
ABN , Publish Date - Feb 19 , 2026 | 08:08 PM
ఆమె అతని కంటే 10 ఏళ్లు పెద్దది. ఇద్దరికీ ఎక్కడ పొత్తు కుదిరిందో తెలీదు గానీ.. జోడీగా మారి ట్రాక్ తప్పారు. విలాసాల మోజులో తప్పుడు పనికి పూనుకున్నారు. ఫైనల్‌గా ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు..
జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి సమీపంలో చోటుచేసుకున్న చైన్ స్నాచింగ్ ఘటనలో మహిళతో పాటు ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని 23 ఏళ్ల నరేంద్ర, 33 ఏళ్ల రేవతిగా గుర్తించారు. ఆమె అతని కంటే 10 ఏళ్లు పెద్దది. ఇద్దరికీ ఎక్కడ పొత్తు కుదిరిందో తెలీదు గానీ.. జోడిగా మారి ట్రాక్ తప్పారు. విలాసాల మోజులో తప్పుడు పనికి పూనుకున్నారు. ఫైనల్‌గా ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నరేంద్ర, రేవతి హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ జల్సాలకు అలవాటు పడ్డారు. జల్సాలు చేయడానికి డబ్బుల కోసం చైన్ స్నాచింగ్‌లకు పూనుకున్నారు. మంగళవారం ఉదయం మాదాపూర్‌లోని హాస్టల్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 39లోని ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మానస మెడలో ఉన్న బంగారు గొలుసును యాక్టివా బైక్‌పై వచ్చి లాక్కెళ్లారు. యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సీసీ టీవీ ఫుటేజ్‌లు, యాక్టివా బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా విచారణ చేపట్టిన క్రైమ్ పోలీసులు.. నరేంద్ర, రేవతిలను గుర్తించారు. అతడి ఫోన్ నెంబర్ ఆధారంగా వారి కదలికలను ట్రాక్ చేశారు. స్నాచింగ్ అనంతరం నిందితులిద్దరూ ఆంధ్రప్రదేశ్‌లోని తమ సొంత ఊళ్లకు పారిపోతున్నట్లు సమాచారం అందింది. జూబ్లీహిల్స్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కలిసి బుధవారం మధ్యాహ్నం సూర్యాపేటలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
యూట్యూబర్ అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్..
‘సర్’ రివిజన్‌కు సన్నాహక పనులు త్వరగా పూర్తి చేయాలి.. రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు