ఆ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్
ABN , Publish Date - Feb 20 , 2026 | 06:40 AM
బాలాజీనగర్ సెక్షన్ పరిధిలోని సబ్‌స్టేషన్లలో మరమ్మతుల నేపథ్యంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప ఒక ప్రకటనలో తెలిపారు.
నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): బాలాజీనగర్ సెక్షన్ పరిధిలోని సబ్‌స్టేషన్లలో మరమ్మతుల నేపథ్యంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప(AE Bhimalingappa) ఒక ప్రకటనలో తెలిపారు. కేపీహెచ్‌బీ ఏడోఫేజ్, శివశక్తినగర్, అలస్బా హోటల్, టి.అంజయ్యనగర్, మూసాపేట్(Moosapet) వార్డు ఆఫీస్ పరిధుల్లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, ఆంజనేయనగర్ మహిళామండలి, మూసాపేట్ చిత్తారమ్మ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సాక్షి మీడియా పై రూ.100 కోట్ల పరువు నష్టం వేసిన హెరిటేజ్..
Read Latest Telangana News and National News