హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు.. అన్వేశ్‌ను ఉపేక్షించం.. కరాటే కల్యాణి స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Feb 20 , 2026 | 06:23 PM
హిందూ దేవుళ్లనే కాకుండా భారతదేశ ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా తెలుగు యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేశ్ వ్యాఖ్యలు చేశారని ప్రముఖ సినీ నటి కరాటే కల్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): హిందూ దేవుళ్లనే కాకుండా.. భారతదేశ ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా తెలుగు యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేశ్ (YouTuber Anvesh) వ్యాఖ్యలు చేశారని ప్రముఖ సినీ నటి కరాటే కల్యాణి (Karate Kalyani) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్వేశ్ లాంటి వారిని ఉపేక్షించకూడదని హెచ్చరించారు. ఫాలోవర్స్ ఉంటే ఏది మాట్లాడితే అది చెల్లుబాటు అవుతుందని అనుకుంటే కుదరదని వార్నింగ్ ఇచ్చారు.
అందుకే కేసు పెట్టాం..
హిందూ దేవుళ్లను కించపరిచినందుకే అన్వేశ్‌పై కేసు పెట్టామని.. తమ ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని కరాటే కల్యాణి తెలిపారు. ఇవాళ(శుక్రవారం) హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆమె మాట్లాడారు. అన్వేశ్ జీరోకు వచ్చారని.. ఎక్కడ స్టార్ట్ అయ్యారో.. అక్కడికే రావాలన్నది తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. అన్వేశ్‌లో మేకపోతు గాంభీర్యం కనిపిస్తోందని విమర్శించారు.
అన్వేశ్‌కి భయం పట్టుకుంది..
యూట్యూబ్ పోతే ఫుడ్డు లేదన్న భయం అతనికి పట్టుకుందని కరాటే కల్యాణి ఎద్దేవా చేశారు. ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ అయ్యాక బుర్ర లేకుండా అతను మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అన్వేశ్ మానసిక స్థితి కూడా బాగోలేదని చెప్పుకొచ్చారు. అన్వేశ్ పాస్‌పోర్ట్ డిపోర్ట్ అయ్యేవరకు తన పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు. అన్వేశ్‌ను భారతదేశం రప్పించడమే తమ లక్ష్యమని కరాటే కల్యాణి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైరిటేజ్.. నాణ్యతలో రాజీ పడబోం: నారా భువనేశ్వరి
యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్
Read Latest Telangana News And AP News And Telugu News