యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Feb 19 , 2026 | 09:16 PM
యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు..
అమరావతి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): యువతకు పెద్దఎత్తున ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) అన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు.
కోచింగ్ సెంటర్ల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలుపై రివ్యూ చేశారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేశ్ ఇవాళ(గురువారం) సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులకు మంత్రి లోకేశ్ మార్గనిర్దేశం చేశారు. జాబ్ క్యాలెండర్‌తో పాటు యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
నేతలకు ఆత్మీయ విందు..

మంత్రి నారా లోకేశ్ ఇవాళ (గురువారం) రాత్రి ఉండవల్లి నివాసంలో.. ఒంగోలు, బాపట్ల కూటమి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులకు ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ విందు భేటీ వేడుకలా జరిగింది. నిత్యం రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, నియోజకవర్గ సమస్యలతో క్షణం తీరికలేకుండా గడిపే ప్రజాప్రతినిధులకు.. మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ విందు ఇచ్చారు. మూడు గంటల పాటు రాజకీయాలతో సంబంధంలేని సరికొత్త ఆనంద ప్రపంచంలో ఉంచారు. నో పాలిటిక్స్.. నో అసెంబ్లీ డిస్కషన్స్.. సరదా సంభాషణలు.. ఆట పట్టించుకోవడం.. ఇలా ఫుల్ జోష్‌తో ఆత్మీయ విందు సాగింది.

ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు..
నకిలీ మద్యం కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగింపు
Read Latest Telangana News And AP News And Telugu News