నకిలీ మద్యం కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగింపు
ABN , Publish Date - Feb 19 , 2026 | 03:39 PM
నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుల రిమాండ్ గడువుని విజయవాడ ఎక్సైజ్ కోర్టు పొడిగించింది. నిందితుల రిమాండ్ గడువుని మార్చి 5వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది..
విజయవాడ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం తయారీ కేసులో (Fake Liquor Case) నిందితుల రిమాండ్ గడువుని విజయవాడ ఎక్సైజ్ కోర్టు పొడిగించింది. రిమాండ్ గడువుని మార్చి 5వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ (గురువారం) సిట్ అధికారులు నకిలీ మద్యం తయారీ కేసు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ, నెల్లూరు, మదనపల్లె జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 10 మంది నిందితులను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానంలో హాజరుపరిచారు. బెయిల్‌పై ఉన్న వారిలో.. 12 మంది నిందితులు కోర్టుకు హాజరయ్యారు. అయితే జోగి రమేశ్, జోగి రాము.. ఈ విచారణకు హాజరుకాకుండా గైర్హాజరు పిటిషన్‌ని దాఖలు చేశారు.
ఏపీ మద్యం కుంభకోణం కేసు విచారణ వాయిదా..
మరోవైపు ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. నిందితులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లపై విచారణని విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: హోంమంత్రి అనిత
మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..
Read Latest Telangana News And AP News And Telugu News