Home » AP Police
అనంతపురం జిల్లాలో వైసీసీ కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. మాజీ ముఖ్యమంత్రతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల సందర్బంగా రప్పా.. రప్పా.. అంటూ ఆ పార్టీ కార్యకర్తలు చేసిన భీభత్సాన్ని పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుంది.
అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌ను ఏపీ సీఐడీ పోలీసులు చేధించారు. కంబోడియా నుంచి సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడిన నిందితుడిని గుర్తించి 1400 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. డైరక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో భారీ క్రైమ్ నెట్‌వర్క్‌ను చేధించారు ఏపీ సీఐడీ అధికారులు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు అనంతపురం జిల్లాలో కొత్త వివాదానికి తెరలేపాయి. మూగజీవాలను బలి ఇచ్చి, ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం 26 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 13 మందిని అరెస్టు చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు.
దొరసానిపాడులో బైక్‌కు సైలెన్సర్లు తీసివేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు వైసీపీ శ్రేణులు. పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా దౌర్జన్యానికి దిగారు.
వైసీపీ శ్రేణులు యథేచ్ఛగా రెచ్చిపోతున్న ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. వైసీపీ హయాంలో బరితెగించిన కార్యకర్తలు, కూటమి ప్రభుత్వంలోనూ అదే ధోరణి కొనసాగిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయవాడ జిల్లా జైల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ బృందం సోమవారం విచారించింది.
శ్రీ సత్యసాయి జిల్లా దేవరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ అలియాస్ ఆసిఫ్ ఇటీవల పాకిస్థాన్ అనుకూల నినాదాలతో సంచలనం రేపాడు. అతను ‘ఐ లవ్ పాకిస్థాన్, పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశాడు.
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. ప్రధాన అనుచరుడు, రాజకీయ సలహాదారుడు కూనసాని వినోద్‌ను గుడివాడ వన్ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
ప్రసాదంపాడులో నలుగురు మావోయిస్టులు పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే వీరిని విజయవాడ ఎంఎస్‌జే కోర్టు పోలీసుల కస్టడీకి ఇచ్చింది.
సైబర్ నేరగాళ్లు యువకుల మొదలు వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు. అవతలి వ్యక్తి బ్యాంకులో బ్యాలెన్స్ ఉందని తెలిస్తే చాలు.. వారికి వీడియోకాల్ ద్వారా ఫోన్‌చేసి ఆధార్‌కార్డు చూపించి మోసం చేస్తున్నారు.