చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం
ABN , Publish Date - Feb 13 , 2026 | 09:27 AM
చిత్తూరు శివారులోని ఇరువరం సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ కారుపై పడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని చిత్తూరు జిల్లా పోలీసులు తెలిపారు.
చిత్తూరు, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు నగర శివారులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం (Chittoor Road Accident) జరిగింది. కంటైనర్ కారుపై పడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. ఇరువరం సర్కిల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుదీప్‌గా గురించారు. మృతుడి స్వగ్రామం గుడిపాల మండలం రామాపురమని తెలిపారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని చిత్తూరు జిల్లా పోలీసులు వెల్లడించారు.
కారు.. కంటైనర్ కిందకు దూసుకుపోవడంతో లోపల ఉన్న వ్యక్తి బయటకు రావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ కట్టర్ల సాయంతో కారును కట్ చేసి వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీశారు.
పోలీసుల దర్యాప్తు..
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు మలుపులు, సర్కిళ్ల వద్ద వేగాన్ని నియంత్రించాల్సి ఉందని.. ముఖ్యంగా రాత్రి వేళల్లో, తెల్లవారుజామున ప్రయాణించేటప్పుడు కంటైనర్ల వంటి భారీ వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు జిల్లా పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం, చర్చలు
ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడి చర్చ
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం..
Read Latest Telangana News And AP News And Telugu News