జిల్లా వ్యాప్తంగా 57 పాఠశాలల్లో రాష్ట్రప్రభుత్వం అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల (విద్యా వాలంటీర్ల)ను నియమించనుంది. గుర్తించిన సబ్జెక్టుల వారిగా వాలాంటీర్లను నియమించేందుకు అవసరమైన నోటిఫికేషన్ ఇచ్చింది.
వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధనకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
నగరి మండలం గుండ్రాజుకుప్పం భూములను నిషేధిత జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం కన్నులపండువగా జరిగింది. మొదట యోగనరసింహస్వామి ఆలయం పక్కనే ఉన్న పరిమళం అర వద్ద కొత్త మూకుళ్లలో దీపాలను వెలగించారు.
దక్షిణ మధ్య రైల్వేలో ఇకపై ఓటీపీ లింక్తో తత్కాల్ టికెట్లు ఇవ్వనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం తిరుపతి నుంచి వివిధ మార్గాల్లో వెళ్లే వందేభారత్ రైళ్లలో ఈ పద్ధతి అమలు చేస్తున్నారు.
కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఇస్తామని అని జనసేన అధ్యక్షుడు,డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ అన్నారు. చిత్తూరు కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటుచేసిన డీడీవో కార్యాలయాన్ని గురువారం మధ్యాహ్నం ప్రారంభించిన ఆయన అదే ఆవరణలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు.
జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో శుక్రవారం మెగా పీటీఎం (మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్) 3.0 జరగనుంది. జిల్లా సమగ్రశిక్ష, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
దిత్వా తుఫాను బలహీనపడినా.. దాని ప్రభావం మాత్రం వీడలేదు. వరుసగా ఐదో రోజూ తీర ప్రాంత, చేరువగా ఉన్న మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. గురువారం తూర్పు మండలాల్లో నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దాదాపుగా చెరువులు, కుంటలు నిండాయి.
జిల్లాను తరచూ తుఫాన్లు వెంటాడుతున్నాయి. నిన్నగాక మొన్న మొంథా తుఫాన్ మిగిల్చిన నష్టాలకు పరిహారం కూడా అందక మునుపే దిత్వా తుఫాన్ దూసుకొచ్చింది. వాయుగుండం నుంచి అల్ప పీడనంగా బలహీనపడినప్పటికీ జిల్లాపై మాత్రం ప్రభావం కనబరిచింది. గత నెల 30న తుఫాన్ ప్రభావం మొదలైనప్పటికీ మొదటి మూడు రోజులూ మోస్తరు వానలే కురిశాయి. అయితే మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ 22.30 గంటల వ్యవధిలోనే ఏడు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వందలాది ఎకరాల్లో వరి పొలాలు నీటమునిగాయి. కూరగాయల పంటలు సైతం అక్కడక్కడా దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం తమకు 270 ఎకరాల్లో మాత్రమే వరిపొలాలు నీట మునిగినట్టు సమాచారం వచ్చిందని తెలిపారు. ఏడు మండలాల్లో భారీ వర్షాలు దిత్వా తుఫాన్ ప్రభావంతో మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 6 గంటల నడుమ జిల్లాలోని సముద్రతీర ప్రాంత ఏడు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. వాకాడు మండలంలో రికార్డు స్థాయిలో 280 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పొరుగునే ఉన్న చిట్టమూరు మండలంలో సైతం 261.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కోట మండలంలో 220, దొరవారిసత్రం మండలంలో 135.8, నాయుడుపేటలో 115.2, ఓజిలిలో 109.4, తడలో 93.8 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది. దిత్వా తుఫాన్ ప్రభావం గత నెల 30వ తేదీనే మొదలైనా ఆ రోజున కనిష్టంగా 4.8 మి.మీ.లు, గరిష్టంగా 45.2 మి.మీ.లు చొప్పున, ఈనెల 1న కనిష్టంగా 1.4 మి.మీ.లు, గరిష్టంగా 45.6 మి.మీ.లు వంతున, 2న ఉదయం 8.30 వరకూ అత్యల్పంగా 2 మిల్లీమీటర్లు, అత్యధికంగా 52.6 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదవగా తర్వాతి 22.30 గంటల వ్యవధిలో తీర ప్రాంత మండలాల్లో రికార్డు స్థాయి వర్షాలు పడ్డాయి. ఈ భారీ వర్షాలకు స్వర్ణముఖి, కాళంగి, కైవల్య సహా పలు నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో పీజీ మూడవ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన ఫీజు చెల్లింపునకు ఈ నెల 12వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. ఈ విషయమై అనుబంధ కాలేజీలు, విభాగాలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వర్సిటీ పరీక్షల డీన్ కొంగర సురేంద్రబాబు, పరీక్షల నియంత్రణాఽధికారి రాజమాణిక్యం తెలిపారు.