Share News

చెలరేగిన పిచ్చికుక్క

ABN , Publish Date - Feb 22 , 2026 | 01:56 AM

పలమనేరలోఓ పట్టణంలో శనివారం ఉదయం ఓ పిచ్చికుక్క చెలరేగిపోయింది. కనిపించిన వారిపైకి దూసుకెళ్లింది. ఇలా దాదాపు 10 మందిని కరిచింది.

చెలరేగిన పిచ్చికుక్క
ప్రభుత్వాస్పత్రి వద్ద బాధితులు

పలమనేరులో 10 మందికి గాయాలు

పలమనేరు, ఫిబ్రవరి21(ఆంధ్రజ్యోతి): పలమనేరలోఓ పట్టణంలో శనివారం ఉదయం ఓ పిచ్చికుక్క చెలరేగిపోయింది. కనిపించిన వారిపైకి దూసుకెళ్లింది. ఇలా దాదాపు 10 మందిని కరిచింది. బాధితులు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్‌ అధికారులు వెంటనే పిచ్చికుక్కను పట్టి.. సమీప అడవిలో విడిచిపెట్టారు. పలమనేరులో పెచ్చుమీరిన కుక్కల గురించి మున్సిపల్‌ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మాంసం దుకాణాల వద్ద వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తుండటంతో కుక్కలు పెరిగిపోయాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 22 , 2026 | 01:56 AM