నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
ABN , Publish Date - Feb 22 , 2026 | 01:52 AM
పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి నిమిషం ఆలస్యం చేసినా అనుమతించరు. చివర్లో ఆందోళన పడటం కన్నా.. అరగంట ముందుగానే చేరుకుంటే ప్రశాంతంగా ఇంటర్ పరీక్ష రాయొచ్చంటున్నారు అధికారులు. ఫస్టియర్ పరీక్షలు సోమవారం.. సెకండియర్ విద్యార్థులకు మంగళవారం నుంచి మొదలయ్యే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
రేపట్నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం
హాజరు కానున్న 29,279 మంది విద్యార్థులు
చిత్తూరు సెంట్రల్, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి నిమిషం ఆలస్యం చేసినా అనుమతించరు. చివర్లో ఆందోళన పడటం కన్నా.. అరగంట ముందుగానే చేరుకుంటే ప్రశాంతంగా ఇంటర్ పరీక్ష రాయొచ్చంటున్నారు అధికారులు. ఫస్టియర్ పరీక్షలు సోమవారం.. సెకండియర్ విద్యార్థులకు మంగళవారం నుంచి మొదలయ్యే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8.30 గంటల నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. జిల్లాలోని 50 కేంద్రాల్లో 29,279 మంది విద్యార్థులు (ఫస్టియర్ 14,729, సెకండియర్ 14,550) పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు వెయ్యి మంది సిబ్బందిని నియమించారు. వీరిలో నలుగురు డీఈసీ మెంబర్లు, 50 మంది చీఫ్ డిపార్టుమెంటల్ అధికారులు, 50 మంది డిపార్టుమెంటల్ అధికారులు, 600 మంది ఇన్విజిలేటర్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఆరు సిట్టింగ్ స్క్వాడ్స్, వీరితో పాటు మహిళా పోలీసులు, పోలీసులు, సెంటర్ సహాయకులు ఉంటారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్ష గదుల్లో వెలుతురు, ఫ్యాన్లు ఉండేలా చర్యలు చేపట్టారు. డెస్క్‌లను సిద్ధం చేశారు. తాగునీరు, వాష్‌రూం, మెడికల్ టీమ్ సదుపాయాలను కల్పించారు. పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లే విద్యార్థులను క్షుణ్నంగా పరిశీలించి అమతిస్తారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్షల సమయం వరకు సమీప ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయనున్నారు.
మనమిత్ర నుంచీ హాల్‌టికెట్
కళాశాల యాజమాన్యం వద్దే హాల్‌టికెట్ తీసుకోవాలన్న నిబంధన లేదు. విద్యార్థులు తమ మొబైల్‌లో మనమిత్ర యాప్‌లో 95523 00009 నంబరు ద్వారా పీడీఎఫ్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదు.
గంట ముందుగా రండి
ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు సౌకర్యాలు కల్పించాం. పరీక్షా కేంద్రానికి గంట ముందుగా చేరుకోవడం ద్వారా టెన్షన్ పొగొట్టుకోవచ్చు. హాట్ టికెట్‌తో ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసే సౌలభ్యం ప్రభుత్వం కల్పించింది. మొదట పరీక్షలనే భయం పోగొట్టుకొని, ఏకాగ్రతతో రాస్తే మంచి మార్కులు సాధించొచ్చు.
- ఎ.రఘుపతి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి