సినీ ఫక్కీలో భారీ చోరీ
ABN , Publish Date - Feb 22 , 2026 | 01:47 AM
సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. నిశ్చితార్థం ఫంక్షన్‌లో 16 సవర్ల బంగారు వడ్డాణం అపహరణకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాయుడుపేట- పండ్లూరు జాతీయ రహదారి సమీపంలో ఉన్న హోటల్ కమ్ ఫంక్షన్ హాల్‌లో ఓజిలి మండలం పున్నేపల్లికి చెందిన తన సమీప బంధువుల నిశ్చితార్థం ఫంక్షన్‌కు శుక్రవారం రేణిగుంట ప్రాంతానికి చెందిన శిల్ప హాజరయ్యారు.
నిశ్చితార్థం ఫంక్షన్‌లో 16 సవర్ల బంగారు వడ్డాణం అపహరణ
నాయుడుపేట టౌన్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. నిశ్చితార్థం ఫంక్షన్‌లో 16 సవర్ల బంగారు వడ్డాణం అపహరణకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాయుడుపేట- పండ్లూరు జాతీయ రహదారి సమీపంలో ఉన్న హోటల్ కమ్ ఫంక్షన్ హాల్‌లో ఓజిలి మండలం పున్నేపల్లికి చెందిన తన సమీప బంధువుల నిశ్చితార్థం ఫంక్షన్‌కు శుక్రవారం రేణిగుంట ప్రాంతానికి చెందిన శిల్ప హాజరయ్యారు. తన 16 సవర్ల బంగారు వడ్డాణంను బ్యాగులో పెట్టుకొచ్చారు. బ్యాగును డ్రెస్సింగ్ రూమ్ ఉంచి ఫంక్షన్ హడావిడిలో ఉండగా.. సినీ ఫక్కీలో ఆ బ్యాగును అపహరించారు. కొంతసేపటికే వడ్డాణం ఉన్న బ్యాగు కనిపించడం లేదని బాధితురాలు గుర్తించి.. చుట్టుపక్కల వెతికారు. ప్రయోజనం లేకపోవడంతో శనివారం నాయుడుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులొచ్చి ఫంక్షన్ హాల్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.