కాణిపాక ఆలయంలో ఫొటోలు తీసిందెవరు?
ABN , Publish Date - Feb 22 , 2026 | 01:54 AM
కాణిపాక వరసిద్ధుడి ఆలయంలో మూల విరాట్, వీరాంజనేయ స్వామి ఆలయంలో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నెల 18న జర్మనీకి చెందిన శ్రీపీఠ నిలయ భక్తి మార్గ్ సెంటర్ పరమహంస విశ్వనాథ గురూజీ వరసిద్ధుని దర్శించుకున్నారు.
నెట్టింట వైరల్ అవుతున్న దృశ్యాలు
ఐరాల(కాణిపాకం), ఫిబ్రవరి 21 (ఆంద్రజ్యోతి): కాణిపాక వరసిద్ధుడి ఆలయంలో మూల విరాట్, వీరాంజనేయ స్వామి ఆలయంలో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నెల 18న జర్మనీకి చెందిన శ్రీపీఠ నిలయ భక్తి మార్గ్ సెంటర్ పరమహంస విశ్వనాథ గురూజీ వరసిద్ధుని దర్శించుకున్నారు. మూల విరాట్‌ను ఆయన దర్శించుకుంటున్న ఫొటో.. వీరాంజనేయ స్వామి వద్ద ఎవరో ఆకతాయి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. వైరల్ అయిన ఈ ఫొటోలను భక్తులు గమనించి తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. దీనిపై ఆలయ ఈవో పెంచలకిషోర్‌ను వివరణ కోరగా.. ‘ఈ విషయం నాకు తెలియదు. ఈ పని చేసింది ఎవరో తెలుసుకుని వారిపై కఠిన చర్యలు తీసకుంటాం. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. ఎవరూ భగవంతుడితో ఇలా ఆటలు ఆడొద్దని సూచించారు.