Share News

రేపు జాబ్‌ మేళా

ABN , Publish Date - Feb 22 , 2026 | 01:41 AM

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ), సొసైటీ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రైస్‌ డెవల్‌పమెంట్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌(సీడా్‌ప) ఆధ్వర్యంలో సోమవారం జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ టీఎన్‌ శోభన్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోటక్‌ మహేంద్ర మైక్రోఫైనాన్స్‌ సంస్థలో ట్రైనీ సెంటర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల కోసం తిరుపతి డీఆర్‌డీఏ కార్యాలయంలోని టీటీడీసీ ప్రాంగణంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివిధ మండలాల్లో సుమారు 49 పోస్టులు ఉన్నాయన్నారు.

రేపు  జాబ్‌ మేళా

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ), సొసైటీ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రైస్‌ డెవల్‌పమెంట్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌(సీడా్‌ప) ఆధ్వర్యంలో సోమవారం జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ టీఎన్‌ శోభన్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోటక్‌ మహేంద్ర మైక్రోఫైనాన్స్‌ సంస్థలో ట్రైనీ సెంటర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల కోసం తిరుపతి డీఆర్‌డీఏ కార్యాలయంలోని టీటీడీసీ ప్రాంగణంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివిధ మండలాల్లో సుమారు 49 పోస్టులు ఉన్నాయన్నారు. టెన్త్‌ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్‌ వరకు చదివిన 21-25 ఏళ్లలోపువారు అర్హులని వివరించారు. అభ్యర్థులు సొంత ద్విచక్ర వాహనంతోపాటు డ్రైవింగ్‌ లైసెన్సు కలిగి ఉండాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.15,500 జీతంతోపాటు ట్రావెలింగ్‌ అలవెన్సు సదుపాయం కంపెనీ కల్పిస్తుందన్నారు. మరిన్ని వివరాలకు 87124 95517 నెంబరులో సంప్రదించాలని సూచించారు.

- తిరుపతి(సత్యనారాయణపురం), ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 22 , 2026 | 01:41 AM