శ్రీవారి ఫొటోను ప్రచార అస్త్రంగా వాడతారా?
ABN , Publish Date - Feb 22 , 2026 | 01:42 AM
శాసన మండలిలో శ్రీవారి చిత్రపటాలను ప్లకార్డులుగా పట్టుకుని వైసీపీ నాయకులు ప్రచార అస్త్రంగా వాడి.. కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని కూటమి నేతలు మండిపడ్డారు. శనివారం తిరుపతిలోని ఓ హోటల్లో వారు మీడియాతో మాట్లాడారు. తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి మాట్లాడుతూ, వైసీపీ నేతలకు హిందూ దేవుళ్లు అన్నా, ఆలయాలన్నా లెక్కలేదన్నారు.
కూటమి నేతల మండిపాటు
తిరుపతి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): శాసన మండలిలో శ్రీవారి చిత్రపటాలను ప్లకార్డులుగా పట్టుకుని వైసీపీ నాయకులు ప్రచార అస్త్రంగా వాడి.. కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని కూటమి నేతలు మండిపడ్డారు. శనివారం తిరుపతిలోని ఓ హోటల్లో వారు మీడియాతో మాట్లాడారు. తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి మాట్లాడుతూ, వైసీపీ నేతలకు హిందూ దేవుళ్లు అన్నా, ఆలయాలన్నా లెక్కలేదన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అనేక ఘటనలే ఉదాహరణలు అని చెప్పారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ, మండలిలో జరిగిన తీరు చూస్తే వైసీపీ నైజం బయటపడిందన్నారు. హిందువులకు వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండు చేశారు. జనసేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, వైసీపీ నేతలకు దేవుడంటే భయం, భక్తిలేదని మరోసారి రుజువైందన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ, కల్తీ నెయ్యిపై సిట్ నివేదకను పక్కనపెట్టి వాళ్ల నోటికివచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. టీడీపీ నేతలు సుగుణమ్మ, నరసింహ యాదవ్ మాట్లాడుతూ, నెయ్యిలో కల్తీ జరగలేదని చర్చికి వచ్చి ప్రమాణం చేసే దమ్ము జగన్ రెడ్డికి ఉందా? అని సవాల్ చేశారు. ఈకార్యక్రమంలో తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి, శ్రీధర్ వర్మ, ఊకా విజయకుమార్, రుద్రకోటి సదాశివం, పుష్పావతి యాదవ్, రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.