Home » Chittoor
కొత్త సంవత్సర కానుకగా రాష్ట్రంలో 5 రకాల కేటగిరీలకు చెందిన భూముల్ని 22ఏ జాబితా నుంచి తొలగిస్లున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాత్ గురువారం ప్రకటించారు. కానీ, సుమారు ఏడాదిన్నరగా నానుస్తున్న ఫ్రీహోల్డ్ భూముల విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరో రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇలాంటి రెండు నెలలు ఇప్పటికే ఆరేడుసార్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో బాధిత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. పైస్థాయిలో ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
రైతులకు రాజముద్ర ఉన్న కొత్త పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీకి రెవెన్యూ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా గురువారం కాణిపాక క్షేత్రానికి వేలాదిగా భక్తులు విచ్చేశారు. దాంతో స్వామి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది.
కూటమి ప్రభుత్వం కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఇంకా 40 శాతంపైనా నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే సమయంలో పదవులు వచ్చిన వారు సంతోషంతో ఉంటే.. పదవులు దక్కని నాయకులు నిరాశ, నిస్పృహలతో ఉన్నారు. అంతేకాక అధినాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీ
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
చిత్తూరు జీఎస్టీ స్కాంపై ఓ యువకుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు నగరానికి చెందిన విజయచక్రవర్తి అనే యువకుడు అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంభంధిచిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఎస్వీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ గుగులోతు సర్దార్ నాయక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జూపార్క్ వద్ద కారులో ఆయన మృతదేహాన్ని గుర్తించారు.
ఇస్రో చరిత్రలోనే అతి భారీ ఉపగ్రహ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూ బర్డ్ బ్లాక్-2ను LVM-3 M-6 రాకెట్ విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధుడి ఆలయ ప్రాంగణం త్వరలో కొత్తరూపు సంతరించుకోనుంది. ఆలయం ముందు నుంచి పుష్కరిణిని 60 అడుగుల దూరంలోకి మార్చనున్నారు.
మనం రోజూ పారిశుధ్య సిబ్బందికి ఇస్తున్న పొడి చెత్తను భవిష్యత్తులో అలాగే ఎత్తిపెట్టుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్వచ్ఛరథం కార్యక్రమంలో భాగంగా మన వద్దనున్న పొడి చెత్త తీసుకుని మన ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు.