నా జన్మలో ఇదో అద్భుత ఘట్టం: బండ్ల గణేశ్
ABN , Publish Date - Feb 10 , 2026 | 02:04 PM
సినీ నిర్మాత బండ్ల గణేశ్ తిరుమలకు చేపట్టిన సంకల్ప యాత్ర పూర్తైంది. 23 రోజుల్లో సుమారు 540 కిలోమీటర్లు నడిచి ఈ రోజు తిరుమలకు చేరుకున్నారాయన.
తిరుమల, ఫిబ్రవరి 10: ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్(Bandla Ganesh) కాలినడకన తిరుమలకు చేపట్టిన 'సంకల్ప యాత్ర' విజయవంతంగా పూర్తైంది. షాద్‌నగర్ నుంచి గత నెల 19న ఈ యాత్ర ప్రారంభమైంది. దాదాపు 23 రోజుల తర్వాత నేడు(మంగళవారం) తిరుమలకు సినీ నిర్మాత చేరుకున్నారు. సుమారు 540 కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లి తిరుమలకు చేరుకున్నారు బండ్ల గణేశ్. రేపు(బుధవారం) ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకోనున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండ్ల గణేశ్.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. యాత్రను పూర్తి చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్వామివారి ఆశీర్వాదంతో ఏ ఆటంకం లేకుండా 23 రోజుల్లో తిరుమలకు చేరుకున్నానన్నారు. ‘నా జన్మలో ఇదో అద్భుత ఘట్టం. స్వామి వారిని నమ్ముకుని ఎవరూ నష్టపోలేదు’ అని గణేశ్ చెప్పారు. ఈ జన్మాంతం స్వామి వారికి రుణపడి ఉంటానని.. శ్రీవారి సేవ చేసుకుంటానని బండ్ల గణేశ్ భక్తిభావంతో అన్నారు.
కాగా.. ఈ రోజు ఉదయం అలిపిరి చేరుకున్న బండ్ల గణేశ్.. అక్కడ పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో టీడీపీ కీలక నేతలు పాల్గొన్నారు. ఆ తర్వాత అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లనున్నారు.
ఇవి కూడా చదవండి...
టీటీడీ లడ్డూ కల్తీ నెయ్యి కేసులో ఈడీ ఎంట్రీ..
భార్య, అత్తామామలే కారణం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్
Read Latest AP News And Telugu News