Share News

భార్య, అత్తామామలే కారణం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్

ABN , Publish Date - Feb 10 , 2026 | 09:25 AM

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. భార్య వెళ్లిపోయిందనే మనస్తాపంతో సీతారాం అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

భార్య, అత్తామామలే కారణం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్
Hyderabad News

హైదరాబాద్, ఫిబ్రవరి 10: నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. భార్య వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని బాచుపల్లిలో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు సీతారాం. అయితే, జనవరి 24న భార్య.. పిల్లలను వదిలి వెళ్లిపోయింది. దీంతో సీతారాం తీవ్ర ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆపై పిల్లలను తీసుకుని అత్తామామలు కూడా నంద్యాలకు వెళ్లిపోయారు.


ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాం.. హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, అత్తామామల కారణంగా తాను మానసికంగా కుంగిపోయానని.. తన చావుకు వారే కారణమంటూ సీతారాం సెల్‌ఫోన్ స్టేటస్‌లో పేర్కొన్నాడు. సమాచారం అందిన వెంటనే హైడ్రా డీఆర్‌ఎఫ్ సిబ్బంది అక్కడకు చేరుకుని మృతదేహాన్ని హుస్సేన్‌సాగర్‌లో నుంచి వెలికితీశారు. ఆపై మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

1897లో మహారాజుల విందు.. డిన్నర్‌లో ఏమేం వంటకాలు ఉన్నాయో తెలుసా?

మీ కళ్లు చురుకైనవి అయితే.. ఈ చెట్టుపై పక్షి ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 10 , 2026 | 10:51 AM