1897లో మహారాజుల విందు.. డిన్నర్‌లో ఏమేం వంటకాలు ఉన్నాయో తెలుసా?
ABN , Publish Date - Feb 10 , 2026 | 07:48 AM
బరోడా మహారాజు.. గ్వాలియర్ మహారాజుకు 1897 జనవరి 31వ తేదీన డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ డిన్నర్‌కు సంబంధించిన మెనూలో ఒక్క భారతీయ వంటకం కూడా లేకపోవటం గమనార్హం..
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ హిస్టోరియన్ నేహా వర్మానీ 130 ఏళ్ల క్రితం నాటి మహారాజుల డిన్నర్ మెనూను బయటపెట్టారు. మెనూకు సంబంధించిన ఓ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. 1897 జనవరి 31వ తేదీన బరోడా మహారాజు.. గ్వాలియర్ మహారాజుకు డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ డిన్నర్‌కు సంబంధించిన మెనూలో ఒక్క భారతీయ వంటకం కూడా లేకపోవటం గమనార్హం. ఆ డిన్నర్‌లో ఇద్దరు మహారాజులు కేవలం ఫ్రెంచ్ ఆహారాన్ని మాత్రమే తీసుకున్నారు.
డిన్నర్ మెనూలోని ఆహార పదార్థాలు..
అయోటాజ్ డి అమాండెస్ : భోజనానికి ముందు వడ్డించే వంటకం. దీన్ని బాదం గింజలతో తయారు చేస్తారు.
పొయిసాన్ బ్రేజ్ సాస్ మయోనైస్ : మయోనీజ్ సాస్‌తో తయారు చేసిన చేపల వంటకం.
క్రీమ్ డి వోలైల్ ట్రఫ్స్ : ట్రఫుల్స్ సువాసన కలిగిన చికెన్ క్రీమ్ సూప్. ఇది ఖరీదైన వంటకం.
కోటెలెట్స్ డి ముటోన్ ఆ ల్ ఇటాలియేన్ : ఇటాలియన్ శైలిలో తయారైన మటన్ కట్లెట్లు.
సెల్ డి పెర్డరో రోటీ ఓ పిటీ పొయిస్ : పచ్చి బఠానీలతో రోస్ట్ చేసిన పార్ట్రిడ్జ్ (పక్షి) మాంసం.
ఫాండ్స్ డి ఆర్టిచోక్స్ ఆ లా డెమి గ్లేస్ : ఫ్రెంచ్ డెమి-గ్లేస్ (బ్రౌన్ సాస్)లో వండిన ఆర్టిచోక్ కూర.
కర్రీ డి మాసెడోయిన్ డి లెగ్యూమ్స్ ఎ రిజ్: వివిధ కూరగాయలతో తయారైన కర్రీ.
పొమ్స్ ఆ లా క్రీమ్ : క్రీమ్‌తో తయారైన ఆపిల్ డెజర్ట్.
గ్లాస్ డి పిస్తాచూ : పిస్తా ఐస్‌క్రీమ్.
నేహా పోస్టు చేసిన మహారాజుల డిన్నర్ మెనూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ మెనూపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘మహారాజులు మన భారతీయ వంటకాలు తింటారని అనుకున్నా. 130 ఏళ్ల క్రితమే ఫ్రెంచ్ వంటకాలు తిన్నారంటే.. మనపై ఫ్రెంచ్ వారి ప్రభావం ఎంత ఉందో ఇట్టే తెలిసిపోతుంది’..‘మహారాజులు ఏం తింటారో తెలుసుకోవాలని చాలా ఏళ్ల నుంచి అనుకుంటూ ఉన్నా. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది’..‘ఇప్పుడు చైనీస్ వంటకాలు ఫేమస్.. అప్పుడు ఫ్రెంచ్ వంటకాలు ఫేమస్.. అంతే తేడా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పెరిగిన దొండకాయ.. తగ్గిన టమాటా