కోటాకు లోబడే కార్ల దిగుమతి
ABN , Publish Date - Feb 10 , 2026 | 06:02 AM
భారత-అమెరికా వాణిజ్య ఒప్పం దం వివరాలు క్రమంగా వెల్లడవుతున్నాయి. ఈ ఒప్పందంతో ఇక ఆ దేశం నుంచి తక్కువ సుంకాలతో లగ్జరీ కార్లు దిగుమతి చేసుకోచ్చని...
మద్యం దిగుమతులకు కనీస ధర
భారత-యూఎస్ వాణిజ్య ఒప్పందం వెల్లడి
న్యూఢిల్లీ: భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం వివరాలు క్రమంగా వెల్లడవుతున్నాయి. ఈ ఒప్పందంతో ఇక ఆ దేశం నుంచి తక్కువ సుంకాలతో లగ్జరీ కార్లు దిగుమతి చేసుకోవచ్చని సంబరపడిన వారి గొంతులో వెలక్కాయ పడింది. కోటా పరిమితులకు లోబడి మాత్రమే ఈ దిగుమతులు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ కోటా పరిమితి ఎంత అనే విషయం ఇంకా వెల్లడి కాలేదు. కోటాకు లోబడి దిగుమతి చేసుకునే లగ్జరీ బైకులు, కార్లపైనా వాటి ఇంజన్ సీసీ సామర్థ్యాన్ని బట్టి 30 నుంచి 40 శాతం దిగుమతి సుంకాలు తప్పవు.
మందు బాబులకూ నిరాశే
భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం మందుబాబులనూ నిరాశ పరిచింది. ఈ ఒప్పందంతో డ్యూటీ ఫ్రీగా వచ్చే సీమ సరుకుతో చిందులేయ వచ్చని బడాబాబులు ఆశించారు. అయితే ఈ దిగుమతులకూ కనీస దిగుమతి ధర తప్పదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏర్పాటు లేకపోతే తాము దుకాణాలు మూసుకోవడం తప్ప మరో మార్గం లేదని ఒప్పందానికి ముందు నుంచే దేశంలోని మద్యం తయారీ కంపెనీలు గగ్గోలు పెట్టాయి. దీంతో వీరి ఆందోళనను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం భారత-అమెరికా వాణిజ్య ఒప్పందంలో ఈ కనీస దిగుమతి ధర క్లాజు చేర్చిందని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇస్లామాబాద్లో ఆత్మాహుతి దాడి.. భారత్ నిధులందిస్తోందంటూ పాక్ మంత్రి ఆరోపణలు..
బంగారం, వెండి స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..