Share News

బంగారం, వెండి స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Feb 09 , 2026 | 06:30 AM

గత వారం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న బంగారం, వెండి రెండు, మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రెండు లోహాలు రికార్డు గరిష్ఠాలను తాకి అంతే వేగంగా కిందకు దిగి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 9న) ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బంగారం, వెండి స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

గత వారం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న బంగారం, వెండి.. రెండు, మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రెండు లోహాలు రికార్డు గరిష్ఠాలను తాకి అంతే వేగంగా కిందకు దిగి వచ్చాయి. పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో ప్రస్తుతం ఈ రెండు లోహాల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం బంగారం, వెండి స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి (Gold prices).


ఈ రోజు (ఫిబ్రవరి 9న) ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,56,590కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,540కి చేరింది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,56,740కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 1,43,690కి చేరుకుంది.


మరోవైపు ఇటీవల భారీగా పతనమైన వెండి కూడా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం రూ.3 లక్షలకు దిగువన కొనసాగుతోంది. సోమవారం కిలోకు వంద రూపాయల మేర తగ్గింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • హైదరాబాద్‌లో రూ. 1,56,590, రూ. 1,43,540

  • విజయవాడలో రూ. 1,56,590, రూ. 1,43,540

  • ఢిల్లీలో రూ. 1,56,740, రూ. 1,43,690

  • ముంబైలో రూ. 1,56,590, రూ. 1,43,540

  • వడోదరలో రూ. 1,56,640, రూ. 1,43,590

  • కోల్‌కతాలో రూ. 1,56,590, రూ. 1,43,540

  • చెన్నైలో రూ. 1,56,590, రూ. 1,43,540

  • బెంగళూరులో రూ. 1,56,590, రూ. 1,43,540

  • కేరళలో రూ. 1,56,590, రూ. 1,43,540

  • పుణెలో రూ. 1,56,590, రూ. 1,43,540


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • హైదరాబాద్‌లో రూ. 2,84,900

  • విజయవాడలో రూ. 2,84,900

  • ఢిల్లీలో రూ. 2,84,900

  • చెన్నైలో రూ. 2,84,900

  • కోల్‌కతాలో రూ. 2,84,900

  • కేరళలో రూ. 2,84,900

  • ముంబైలో రూ. 2,84,900

  • బెంగళూరులో రూ. 2,84,900

  • వడోదరలో రూ. 2,84,900

  • అహ్మదాబాద్‌లో రూ. 2,84,900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..

భారత్‌లో మరో సరికొత్త లీగ్..

Updated Date - Feb 09 , 2026 | 08:47 AM