Share News

టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..

ABN , Publish Date - Feb 08 , 2026 | 07:15 PM

టీ20 వరల్డ్ కప్-2026లో నేపాల్ సంచలన విజయాన్ని త్రుటిలో చేజార్చుకుంది. ముంబై వేదికగా ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత గ్రూప్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..
Nepal vs England

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా ఇవాళ(ఆదివారం) ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో పసికూన నేపాల్(Nepal vs England) సంచలన విజయాన్ని తృటిలో చేజార్చుకుంది. ఆదివారం జరిగిన ఉత్కంఠ భరిత గ్రూప్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో 4 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్‌ చివరి వరకు పోరాడింది. మొత్తంగా 20 ఓవర్లలో 180/6 పరుగులు చేసి.. విజయానికి 4 పరుగుల ముందే ఆగిపోయింది. నేపాల్ బ్యాటర్లలో దీపేంద్ర సింగ్‌ (44), రోహిత్‌ (39), లోకేశ్‌ బామ్‌ (39*), కుశాల్‌ (29) రాణించారు. ఆరిఫ్‌(10), ఆసిఫ్(7) గుల్సాన్‌ 1, కరణ్‌ కేసీ(1*) పరుగులు చేశారు.


నేపాల్ ఇన్నింగ్స్‌లో మూడో వికెట్‌కు దీపేంద్రసింగ్‌(Deependra Singh), రోహిత్‌ కలిసి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఒకానొక దశలో నేపాల్ సంచలన విజయం నమోదు చేస్తుందని అందరూ భావించారు. అయితే చివరి బంతికి ఆరు పరుగులు చేయాల్సిన పరిస్థితిలో నేపాల్‌ బ్యాటర్‌ ఒక పరుగే చేయడంతో ఓటమి తప్పలేదు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో లియామ్‌ రెండు వికెట్లు సాధించాడు. అలానే జోఫ్రా, విల్‌ జాక్స్‌, సామ్‌ కరన్‌, ల్యూక్‌ ఒక్కో వికెట్‌ తీశారు.


అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్(England) బ్యాటింగ్ కు దిగి... నిర్ణీత 20 ఓవర్లకు గాను 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. జాకబ్‌ (55), బ్రూక్‌ (53) హాఫ్ సెంచరీలతో రాణించారు. విల్‌ జాక్స్‌ (39*), బట్లర్‌ (29) కూడా భారీ స్కోర్ చేయడంలో సాయపడ్డారు. మిగిలిన బ్యాటర్ల ఫిలిప్‌ సాల్ట్‌ (1), బాంటన్‌ (2), సామ్‌ కరన్‌ (2) స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. నేపాల్‌ బౌలర్లలో దీపేంద్ర సింగ్‌, నందన్‌ యాదవ్‌ రెండేసి వికెట్లు సాధించారు. షేర్‌ మల్ల, సందీప్‌ చెరో వికెట్‌ తీశారు. విల్ జాక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్ 2026: అభిషేక్‌కు అనారోగ్యం.. ఆ స్టార్ ఆల్‌రౌండర్ రీఎంట్రీ!

టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. కోహ్లీ రికార్డు బద్దలు

Updated Date - Feb 08 , 2026 | 07:54 PM