Home » T20 WORLD CUP
టీ20 వరల్డ్ కప్ -2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈ టోర్నీని భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో ఆయా దేశాలు టీ20 వరల్డ్ కప్ ఆడే తమ జట్టును ప్రకటిస్తున్నాయి. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు కూడా తమ జట్టును ప్రకటించింది. మిచెల్ మార్ష్ సారథ్యంలో.. 15 మంది సభ్యులతో కూడిన తమ బృందాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి భారత జట్టును సెలక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నాడు. టీమిండియాలోకి ఇషాన్ రీఎంట్రీపై భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ స్పందించాడు.
వచ్చే ఏడాది జరిగే టీ 20 వరల్డ్‌కప్ 2026కు సంబంధించి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. వరల్డ్‌కప్ మ్యాచ్‌లు 7 ఫిబ్రవరి 2026 నుంచి ప్రారంభం కానున్నాయి.
U19 Women's T20 World Cup: అమ్మాయిలు అదుర్స్ అనిపించారు. మహిళల అండర్ 19 విమెన్స్ వరల్డ్ కప్‌లో భారత్‌ను విజేతగా నిలిపారు. ఆఖరి పోరులో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వ పటిమపై మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో విక్రమ్ మాట్లాడుతూ రోహిత్‌ను గొప్ప కెప్టెన్‌గా అభివర్ణించాడు.
ఇండియన్ క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని. క్రికెట్ నుంచి రిటైరయ్యారు. ఐపీఎల్లో చెన్నై జట్టును లీడ్ చేస్తున్నారు. ధోనిని జోగిందర్ శర్మ కలిశారు. వీరిద్దరూ కలిసి 2007 టీ 20 వరల్డ్ కప్ సమయంలో ఆడారు. ఆ తర్వాత కలిసింది లేదు. పన్నెండేళ్ల తర్వాత ధోనిని మీట్ అయ్యారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
టీమిండియా టీ 20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత స్టేడియంలో జరిగిన ఓ ఘటనను స్పిన్ మెస్ట్రో రవిచంద్రన్ అశ్విన్ రివీల్ చేశారు. వరల్డ్ కప్ గెలవడాన్ని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకు అనుగుణంగా కప్ గెలిచి ద్రావిడ్‌కు గిప్ట్ ఇవ్వాలని సభ్యులు భావించారు. కలిసికట్టుగా ఆడి, చివరికి కప్పు కొట్టారు.
దాదాపు 13 ఏళ్ల తర్వాత టీమిండియాకు ప్రపంచకప్ అందించిన రోహిత్ శర్మ.. వెంటనే అంతర్జాతీ టీ20 ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. రోహిత్ ఇకపై టెస్ట్‌లు, వన్డేల్లోనే కొనసాగుతాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 37 సంవత్సరాలు.
అమెరికా-న్యూయార్క్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత సాధించిన ఐసీసీ టోర్నీ కావడంతో అటు ఆటగాళ్లు, ఇటు క్రికెట్ అభిమానులు భావోద్వేగంలో మునిగిపోయారు. బార్బొడాస్‌లో టీమిండియా సాధించిన విజయానికి యావత్ భారతం ఉప్పొంగింది.
టీ 20 వరల్డ్ కప్ ముగిసింది. భారత్ విశ్వ విజేతగా నిలిచింది. భారత జట్టును ముందుండి నడిపింది కోచ్ రాహుల్ ద్రావిడ్. 17 ఏళ్ల తర్వాత భారత్‌కు ప్రపంచ కప్‌ను అందించారు. వరల్డ్ కప్ తర్వాత కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని ముందే ద్రావిడ్ ప్రకటించారు. కప్పు గెలిచి ద్రావిడ్‌కు గిప్ట్ అందించాలని టీమ్ మెంబర్స్ భావించి, అందజేశారు కూడా. నెక్ట్స్ టీమ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైంది. మరి రాహుల్ ద్రావిడ్ ఏం చేస్తారు.