Share News

గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్ లాబీలో హార్దిక్ పాండ్య.. వీడియో వైరల్

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:15 PM

టీ20 వరల్డ్‌కప్ 2026 నేపథ్యంలో బీసీసీఐ ఆటగాళ్లపై కఠిన నియమాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తన గర్ల్‌ఫ్రెండ్ మహిక శర్మతో కొలంబోలోని హోటల్ లాబీలో కనిపించాడు.

గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్ లాబీలో హార్దిక్ పాండ్య.. వీడియో వైరల్
Hardik Pandya

ఇంటర్నెట్ డెస్క్: టీ20 వరల్డ్‌కప్ 2026 నేపథ్యంలో బీసీసీఐ ఆటగాళ్లపై కఠిన నియమాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో ఉండటానికి వీల్లేదు. అయితే టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మతో కొలంబోలోని హోటల్ లాబీలో కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


కొలంబోలోని హోటల్ లాబీలో మహికా చేతిని పట్టుకుని హార్దిక్ నడుస్తూ కనిపించాడు. అయితే అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది ఆయన దుస్తులే! హోటల్ లాబీలోనే బాత్‌రోబ్‌ ధరించి కనిపించడం చర్చనీయాంశంగా మారింది. దీనికిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


వాలెంటైన్స్ డే స్పెషల్

ఇదిలా ఉండగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా హార్దిక్ కొత్త టాటూ వేయించుకున్న విషయం కూడా బయటకొచ్చింది. రెండు చిరుతల ఆకృతులతో పాటు ‘ఎం’ అనే అక్షరాన్ని మెడ వెనుక భాగంలో టాటూగా వేయించుకుని మహికాపై తన ప్రేమను వ్యక్తపరిచాడు. 2025లో హార్దిక్-మహికా ప్రేమ వ్యవహారం అధికారికంగా బయటపడింది. ఇటీవల తన టీ20 ప్రదర్శనలను మహికాకే అంకితం చేస్తున్నట్టు హార్దిక్ వెల్లడించాడు. ‘నాకు చాలా ప్రియమైన వారికి మాత్రమే ఈ క్రెడిట్ దక్కుతుంది. నా గర్ల్‌ఫ్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నా జీవితంలోకి మహికా వచ్చిన తర్వాత నాకు అన్నీ మంచి విషయాలే జరిగాయి. ఆమె నాకు అన్ని విషయాల్లోనూ తోడుగా నిలిచింది’ అని హార్దిక్ అన్నాడు.


ఇవి కూడా చదవండి:

2003 ప్రపంచ కప్ టోర్నీ.. సచిన్ ఆడిన ఆ నాక్ పాక్‌కు గుర్తుండిపోద్ది!

పదో తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ

Updated Date - Feb 14 , 2026 | 01:29 PM