Home » Cricket
ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సరికి ఆసీస్.. 8 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అస్వస్థతకు గురయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడ్డాడు. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరూన్ గ్రీన్‌ను రూ.25.20కోట్లకు కేకేఆర్ తీసుకున్న విషయం తెలిసిందే. కాగా యాషెస్ సిరీస్‌లో గ్రీన్ డకౌట్ అయ్యాడు. కేకేఆర్‌కు ఎలా ఆడతాడో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో రవి బిష్ణోయ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.7.20కోట్లకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అతడు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. జడేజాతో కలిసి ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
శ్రీలంక స్టార్ పేసర్ మతీశా పతిరనను ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.18కోట్లు పెట్టి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నైతో తనకున్న అనుభవాన్ని, ధోనీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పతిరన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
ఎంఎస్ ధోనీ ఐపీఎల్ కెరీర్‌పై టీమిండియా మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ కావొచ్చు అని చెప్పుకొచ్చాడు. అందుకే టీమ్‌కి యాజమాన్యం యువ ప్లేయర్లను తీసుకున్నట్లు వెల్లడించాడు.
ఐపీఎల్ 2026కి సంబంధించిన మినీ వేలం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. అబుదాబీ వేదికగా వేలం ప్రక్రియ కొనసాగనుంది. ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత పర్సు ఉందంటే..?
అబుదాబి వేదికగా నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనుంది. ఈ వేలంలో బీసీసీఐ ఓ కొత్త నియమాన్ని రూపొందించింది. ఒకే ఆటగాడి కోసం రెండు లేదా అంతకంటే ఎక్కువ జట్లు ఒకే బిడ్‌పై నిలిచిపోయినప్పుడు ‘టై-బ్రేకర్’ నియమాన్ని వాడుతారు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే పలు కీలక సూచనలు చేశాడు. జట్టుకు తానే సీఈవో అన్నట్లు భావించకూడదని.. కెప్టెన్ అన్నీ నిర్ణయాలు తీసుకుంటాడని అన్నాడు.
భారత క్రికెట్ యంగ్ సెన్సెషన్ వైభవ్ సూర్యవంశీ అండర్ 19 ఆసియా కప్‌లో అదరగొడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో 171 పరుగుల చేసిన వైభవ్.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. నేడు మలేసియాతో టీమిండియా తలపడనున్న నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ వైభవ్ గురించి మాట్లాడాడు.