Share News

ఐర్లాండ్‌ vs జింబాబ్వే: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. సూపర్ 8కి జింబాబ్వే

ABN , Publish Date - Feb 17 , 2026 | 05:55 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరగాల్సి ఐర్లాండ్-జింబాబ్వే మ్యాచ్ రద్దు అయింది. వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే పోరుకు తెరపడింది. పిచ్ క్యురేటర్లతో మాట్లాడి అంపైర్లు తమ తుది నిర్ణయాన్ని వెల్లడించారు.

ఐర్లాండ్‌ vs జింబాబ్వే: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. సూపర్ 8కి జింబాబ్వే
Ireland vs Zimbabwe

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరగాల్సిన ఐర్లాండ్-జింబాబ్వే మ్యాచ్ రద్దు అయింది. వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే పోరుకు తెరపడింది. పిచ్ క్యురేటర్లతో మాట్లాడి అంపైర్లు తమ తుది నిర్ణయాన్ని వెల్లడించారు. కాగా మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్‌కు వరుణుడు తీవ్ర ఆటంకం కలిగించాడు. దీంతో ఐర్లాండ్-జింబాబ్వే జట్లకు చెరొక పాయింట్ లభించింది. ఈ పరిణామంతో జింబాబ్వే జట్టు సూపర్ 8కు అర్హత సాధించింది.


గ్రూప్ బిలో ఉన్న ఈ జట్టు మూడు మ్యాచ్‌లు రెండింట్లో విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు గ్రూప్ స్టేజిలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ బిలో శ్రీలంక, జింబాబ్వే సూపర్ 8కు అర్హత సాధించగా.. ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్ ఎలిమినేట్ అయ్యాయి. కాగా సూపర్ 8కి క్వాలిఫై అయిన ఏడో జట్టుగా జింబాబ్వే నిలిచింది. గ్రూప్ సిలో వెస్టిండీస్, ఇంగ్లండ్ తదుపరి దశకు అర్హత సాధించగా.. స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్ ఎలిమేట్ అయ్యాయి. గ్రూప్ డిలో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్ 8కి చేరుకున్నాయి. కేవలం గ్రూప్ ఏలో భారత్ సూపర్ 8కి చేరుకోగా.. యూఎస్ఏ, పాకిస్థాన్ జట్లు రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. బుధవారం నమీబియాతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే పాక్ తదుపరి దశకు చేరుతుంది. లేదా యూఎస్ఏ అర్హత సాధిస్తుంది.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా కథ ముగిసినట్లేనా?

ఇమ్రాన్ ఖాన్‌కు అనారోగ్యం.. పాక్ ప్రభుత్వానికి కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ లేఖ

Updated Date - Feb 17 , 2026 | 06:32 PM