Home » Sports
ఫుట్‌బాల్‌ను ఓ పిచ్చిగా ఆరాధించే 'సిటీ ఆఫ్ జాయ్' కోల్‌కతా నగరంలో పసుపు జెర్సీల సందడి మొదలైంది. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ బ్రెజిల్ జాతీయ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టడంతో నగరం అంతటా ఫుట్‌బాల్ ఫీవర్ కమ్మేసింది.
జపాన్‌లోని ఐచి-నగోయాలో జరిగిన 2026 ఆసియా క్రీడల్లో భారత్ 85 పతకాలతో తన ప్రస్థానాన్ని ముగించింది. ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి.
ఆసియా క్రీడలు 2026లో ఇవాళ(శనివారం)కూడా భారత్ ఖాతాలో పసిడి పతకాలు వెల్లువెత్తాయి. హాకీలోనూ భారత్ స్వర్ణం సాధించింది.
ఆసియా క్రీడలు 2026లో భాగంగా భారత్ ఖాతాలో 19వ గోల్డ్ మెడల్ చేరింది. ఇవాళ(శనివారం) పాక్‌తో జరిగిన పురుషుల క్రికెట్లో భారత్ విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియా పలు రికార్డులు బద్దలు కొట్టింది.
ఆసియా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో పసిడి చేరింది. పురుషుల క్రికెట్‌లో పాకిస్థాన్‌పై భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఆసియా క్రీడలు 2026లో భారత్, పాకిస్థాన్ జట్ల గోల్డ్ మెడల్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.
ఆసియా క్రీడల భారత్-పాక్ క్రికెట్ ఫైనల్లో ఆటగాళ్లు హ్యాండ్‌షేక్ చేసుకోలేదు. అయితే టేబుల్ టెన్నిస్, స్క్వాష్, హాకీ, వాలీబాల్‌లో మాత్రం క్రీడాస్ఫూర్తితో పరస్పరం అభివాదాలు చేసుకున్నారు. కానీ క్రికెట్లోనే ఎందుకిలా.?
వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన తర్వాత సైమ్ ఆయుబ్ సంబరాలు చేసుకున్నాడు. అయితే అతడి బౌలింగ్‌లోనే అభిషేక్ శర్మ 2 బౌండరీలు, ఓ సిక్సర్ బాది బదులిచ్చాడు.
ఆసియా క్రీడలు 2026లో భాగంగా స్వర్ణ పతకం కోసం చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.
ఆసియా క్రీడల్లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న ఫైనల్లో భారత బ్యాటర్ అభిషేక్ శర్మ చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించడం సహా పలు రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు.