Share News

టీ20 ప్రపంచ కప్ 2026: యూఏఈతో మ్యాచ్.. సౌతాఫ్రికా అలవోక విజయం

ABN , Publish Date - Feb 18 , 2026 | 03:03 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. 123 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్.. 13.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

టీ20 ప్రపంచ కప్ 2026: యూఏఈతో మ్యాచ్.. సౌతాఫ్రికా అలవోక విజయం
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. 123 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్.. 13.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. కెప్టెన్ మార్క్‌రమ్(28; 11 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), బ్రెవిస్(36; 25 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) చెలరేగి ఆడారు.


ర్యాన్ రికెల్టన్(30) రాణించాడు. ఓపెనర్ డికాక్(14), స్టబ్స్(6*), జాసన్ స్మిత్(3*) పరుగులు చేశారు. యూఏఈ బౌలర్లలో హైదర్‌ అలీ, జవాదుల్లా, అర్ఫాన్‌, ఫారుఖ్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఈఏ.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. యూఏఈ బ్యాటర్లలో అలీషన్‌ షరాఫు (45; 38 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్స్‌) బ్యాటింగ్‌లో రాణించాడు. మహ్మద్‌ వసీమ్‌ (22) ఫర్వాలేదనిపించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కార్బిన్‌ బోష్‌ 3, అన్రిచ్ నోర్ట్జే 2, జార్జి లిండే 1 వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.


ఇవి కూడా చదవండి:

చరిత్ర సృష్టించిన యువరాజ్.. ప్రపంచ రికార్డు

ఇలాంటి సిక్స్ ఎప్పుడు చూసి ఉండరు.. వీడియో వైరల్

Updated Date - Feb 18 , 2026 | 03:03 PM