ఇలాంటి సిక్స్ ఎప్పుడు చూసి ఉండరు.. వీడియో వైరల్
ABN , Publish Date - Feb 18 , 2026 | 08:27 AM
న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ గ్లేన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే సిక్స్ బాదాడు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న(మంగళవారం) కెనడాతో జరిగిన మ్యాచ్‌లో తన స్టాన్స్ మార్చుకొని స్విచ్ హిట్‌తో బంతిని సిక్సర్ తరలించాడు.
స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ మ్యాచుల్లో తరచూ ఏదో ఒక అద్భుతం ఘటన చోటుచేసుకుంది. బౌలింగ్, బ్యాటింగ్ సమయాల్లో జరిగే కొన్ని దృశ్యాలు ఔరా అనిపిస్తాయి. కొందరు బ్యాటర్లు కొట్టే సిక్సర్లు క్రికెట్ అభిమానులతో పాటు అందరినీ షాక్ గురి చేస్తుంటాయి. ఇలా కూడా సిక్సర్లు కొడతారా? అంటూ క్రికెట్ ప్రియులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ గ్లేన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే సిక్స్ బాదాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న(మంగళవారం) కెనడా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. కివీస్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. గ్లేన్ ఫిలిప్స్ తన స్టాన్స్ ను మార్చుకుని మరీ సిక్సర్ బాదాడు. కెనడా బౌలర్ సాద్ బిన్ జఫర్ వేసిన 13 ఓవర్ మూడో బంతిని ఫిలిప్స్ స్విచ్ హిట్‌తో డీప్ ఎక్స్‌ట్రా కవర్ దిశగా బౌండరీ తరలించాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేసిన ఈ బంతిని స్విచ్ హిట్ ద్వారా ఫిలిప్స్ సిక్సర్‌గా మలిచాడు.
ఫిలిప్స్ స్టాన్స్ మార్చుకోవడం వల్ల ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీ కాస్త అతనికి డౌన్ ది లెగ్ డెలివరీగా మారిపోయింది. దాంతో డీప్ ఎక్స్‌ట్రా కవర్ దిశగా ఫిలిప్స్ తన మణికట్టు బలాన్ని ఉపయోగించి బౌండరీని రాబట్టాడు. బంతి స్లోగా రావడం కూడా ఫిలిప్స్‌కు కలిసొచ్చింది. ఫీల్డింగ్ వ్యూహాన్ని దెబ్బతీయడానికి చివరి నిమిషంలో ఫిలిప్స్ స్టాన్స్ మార్చుకున్నాడు.
కుడిచేతి వాటం బ్యాటర్ కోసం పెట్టిన ఫీల్డింగ్‌ను ఈ స్విచ్ హిట్ ఛిన్నాభిన్నం చేసింది. మొత్తంగా ఈ వినూత్న షాట్‌కు మైదానంలోని ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ సిక్స్‌కు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వారెవ్వా ఫిలిప్స్ వాటే షాట్ అని కొనియాడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
నెదర్లాండ్స్‌తో ఆడే భారత తుది జట్టు ఇదే!