నెదర్లాండ్స్‌తో ఆడే భారత తుది జట్టు ఇదే!
ABN , Publish Date - Feb 18 , 2026 | 07:44 AM
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ చెత్త ఫీల్డింగ్‌తో హార్దిక్ పాండ్యా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఇవాళ నెదర్లాండ్స్ తో జరిగే మ్యాచ్ లో అతడిపై వేటు పడనుంది.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో హ్యాట్రిక్ విజయాలతో టీమిండియా జోరుమీద ఉంది. ఈ క్రమంలోనే తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ను కూడా ఘనంగా ముగించాలనే పట్టుదలతో భారత జట్టు ఉంది. ఇవాళ(బుధవారం) గ్రూప్-ఏలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఫిబ్రవరి 15న దాయాదీ పాకిస్థాన్ ను 61 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించడంతో టీమిండియా ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే ప్రత్యర్థి పసికూనే అయినా భారత్ ఏ మాత్రం లైట్ తీసుకోవడం లేదు.
కుల్దీప్‌పై వేటు..
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ చెత్త ఫీల్డింగ్‌తో హార్దిక్ పాండ్యా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఇవాళ నెదర్లాండ్స్ తో జరిగే మ్యాచ్ లో అతడపై వేటు పడనుంది. ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌లో అదరగొట్టిన ఈ చైనామాన్ .. ఫీల్డింగ్ విషయంలో మాత్రం విమర్శల పాలయ్యాడు. అలానే వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడిన స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు కూడా విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోందని సమాచారం. ఒక వేళ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలనుకుంటే అతడి స్థానంలో హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ మహమ్మద్ సిరాజ్ జట్టులోకి వస్తాడు. మిగతా బౌలింగ్ కాంబినేషన్‌లో మార్పులు జరిగే అవకాశం లేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా మిస్టరీ బౌలర్ వరుణ్ చక్రవర్తీ ఆడనుండగా.. స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ ఆడనున్నాడు.
భారత్ తుది జట్టు(అంచనా)
ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా/మహమ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తీ.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా కథ ముగిసినట్లేనా?
ఇమ్రాన్ ఖాన్‌కు అనారోగ్యం.. పాక్ ప్రభుత్వానికి కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ లేఖ