Share News

ఆస్ట్రేలియా అవుట్‌

ABN , Publish Date - Feb 18 , 2026 | 03:05 AM

టీ20 వరల్డ్‌క్‌పలో పెను సంచలనం చోటు చేసుకుంది. మాజీ చాంపియన్‌ ఆస్ట్రేలియా టోర్నీ నుంచి అవుట్‌ కాగా.. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జింబాబ్వే సూపర్‌-8కు...

ఆస్ట్రేలియా అవుట్‌

సూపర్‌-8కు జింబాబ్వే

  • ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు వర్షం అడ్డంకి

పల్లెకెలె: టీ20 వరల్డ్‌క్‌పలో పెను సంచలనం చోటు చేసుకుంది. మాజీ చాంపియన్‌ ఆస్ట్రేలియా టోర్నీ నుంచి అవుట్‌ కాగా.. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జింబాబ్వే సూపర్‌-8కు దూసుకెళ్లింది. గ్రూప్‌-బిలో జింబాబ్వే-ఐర్లాండ్‌ జట్ల మధ్య మంగళవారం మధ్యాహ్నం జరగాల్సిన మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. టాస్‌ కూడా సాధ్యపడలేదు. సాయంత్రం 5.30 వరకు వేచి చూసిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఐర్లాండ్‌, జింబాబ్వేకు చెరో పాయింట్‌ లభించాయి. ఫలితంగా గ్రూప్‌-బిలో శ్రీలంక 6, జింబాబ్వే 5 పాయింట్లు సాధించి సూపర్‌-8 బెర్త్‌లు ఖరారు చేసుకొన్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి మాత్రమే గెలిచిన ఆస్ట్రేలియా రెండు పాయింట్లు సాధించింది. ఒమన్‌తో మ్యాచ్‌ మాత్రమే మిగిలున్న నేపథ్యంలో ఒకవేళ ఆసీస్‌ విజయం సాధించినా, ఆ జట్టుకు మొత్తం నాలుగు పాయింట్లు మాత్రమే లభిస్తాయి. అంటే.. ఐదు పాయింట్లతో ఉన్న జింబాబ్వేను కంగారూలు అధిగమించలేరు. ఈ క్రమంలో సూపర్‌-8కు చేరుకొన్న ఏడో జట్టుగా జింబాబ్వే నిలిచింది.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా కథ ముగిసినట్లేనా?

ఇమ్రాన్ ఖాన్‌కు అనారోగ్యం.. పాక్ ప్రభుత్వానికి కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ లేఖ

Updated Date - Feb 18 , 2026 | 03:05 AM