Home » Sports » Cricket News
ప్రపంచ కప్ గెలుపుతో ఉత్సాహంగా ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ యువతకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చింది. ‘కలలు కనడం ఆపొద్దు, కష్టపడితే అవి నిజమవుతాయి’ అని సూచించింది.
భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మోకాలి గాయం కారణంగా బిగ్‌బాష్ లీగ్ నుంచి తప్పుకున్నాడు. సిడ్నీ థండర్ జట్టులో అరంగేట్రం చేయాల్సి ఉండగా.. ఆ అవకాశం వాయిదా పడింది.
2003 ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌కు రూ.వెయ్యి మాత్రమే ఇచ్చారని మిథాలీ రాజ్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో మహిళా క్రికెట్‌కు స్పాన్సర్లు, సౌకర్యాలు కూడా లేవని చెప్పారు.
ప్రపంచ కప్ గెలిచిన వెంటనే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేరుగా వెళ్లి తన తండ్రిని హత్తుకుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తండ్రి హర్మందర్ సింగ్ భుల్లర్ తన కుమార్తెను ఆనందంగా ఆలింగనం చేసుకున్నారు.
భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ తన 36 ఏళ్ల వయస్సులో వన్డే ప్రపంచ కప్‌ను అందుకుంది. హర్మన్ నాయకత్వంలో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. అయితే మైదానంలో పరుగుల వర్షం కురిపించే హర్మన్.. సంపాదనలోనూ రూ.కోట్లు పోగేస్తుంది.
క్రికెట్ చరిత్రలో ముంబై వేదికగా ఎన్నో చారిత్రాత్మకమైన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. 2011 ప్రపంచ కప్ నుంచి ఆదివారం జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ వరకు ఎన్నో మరువలేని జ్ఞాపకాలు, గుర్తులు ఉన్నాయి.
టీమిండియా ప్లేయర్లు అందరూ తమ సంబరాల్లో మునిగి ఉంటే.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం గురుభక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. తనను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్‌కు పాదాభివందనం చేసింది.
ఫైనల్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 299 పరుగులు లక్ష్యాన్ని సౌతాఫ్రికాకు నిర్దేశించింది. అప్పటికే ఫామ్‌లో ఉన్న సఫారీ సేనకు ఇది పెద్ద కష్టమేమీ కాదనే భావించారంతా. కానీ.. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీసుకున్న ఓ నిర్ణయమే తమ కొంప ముంచిందని సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ వెల్లడించింది.
ప్రపంచ కప్ గెలవడంలో ప్రతి ఒక్క ప్లేయర్ కీలక పాత్ర పోషించారు. ఇందులో మన తెలుగు బిడ్డ నల్లపురెడ్డి శ్రీ చరణి కూడా భాగమైంది. ఇదే ఆమెకు తొలి ప్రపంచ కప్. అరంగేట్రంలోనే అద్భుతం చేసింది. 9 మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టి టాప్ 5 బౌలర్లలో నిలిచింది.
మహిళల ప్రపంచ కప్ విజేతగా నిలిచిన క్రికెటర్లకు BCCI భారీ నజరానా ప్రకటించింది. అటు, ఐసీసీ కూడా గత ఎడిషన్‌తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీనీ దాదాపు మూడు రెట్లు చేసింది. ఇంకా ఎన్నో సంస్థలు భారీగా క్యాష్ రివార్డులు..