కర్ణాటక 15వ సారి..
ABN , Publish Date - Feb 20 , 2026 | 05:10 AM
కర్ణాటక జట్టు 15వసారి ప్రతిష్ఠాత్మక రంజీట్రోఫీ ఫైనల్లోకి అడుగుపెట్టిం ది. ఉత్తరాఖండ్‌తో ఇక్కడ జరిగిన సెమీఫైనల్లో..మొదటి ఇ న్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా టైటిల్ ఫైట్‌కు చేరింది. ఈనెల...
రంజీట్రోఫీ ఫైనల్‌కు చేరిక జమ్మూ కశ్మీర్‌తో అమీతుమీ
లఖ్‌నవూ: కర్ణాటక జట్టు 15వసారి ప్రతిష్ఠాత్మక రంజీట్రోఫీ ఫైనల్లోకి అడుగుపెట్టిం ది. ఉత్తరాఖండ్‌తో ఇక్కడ జరిగిన సెమీఫైనల్లో..మొదటి ఇ న్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా టైటిల్ ఫైట్‌కు చేరింది. ఈనెల 24 నుంచి హుబ్లీలో జరిగే తు ది పోరులో జమ్మూ కశ్మీర్‌ను ఢీకొంటుంది. మరో సెమీ్‌సలో బెంగాల్‌కు జమ్మూ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఓవర్‌నైట్ 299/6 స్కోరుతో గురువారం, రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక 323 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ స్మరణ్ (127) శతక మోత మోగించాడు. కేఎల్ రాహుల్ (86 నాటౌట్) అజేయంగా నిలిచాడు. మొత్తంగా కర్ణాటక 826 పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. అనంతరం 827 పరుగుల కనీవినీ ఎరుగని లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఉత్తరాఖండ్ చివరి రోజు ఆట ఆఖరికి 260/6 స్కోరు చేసింది. 11 ఏళ్ల తర్వాత కర్ణాటక ఫైనల్‌కు చేరింది.
సంక్షిప్త స్కోర్లు:
కర్ణాటక: 736, 323 (స్మరణ్ 127, కేఎల్ రాహుల్ 86 నాటౌట్, మయాంక్ మిశ్రా 4/69, అభయ్ నేగి 2/63);
ఉత్తరాఖండ్: 233, 260/6 (అవ్‌నీష్ 66, అభయ్ నేగి 57 నాటౌట్, సౌరభ్ రావత్ 53 నాటౌట్, శ్రేయాస్ గోపాల్ 3/83, ప్రసిద్ధ్ 2/17)
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం