Share News

మళ్లీ భారత్, పాకిస్థాన్ మ్యాచ్! పూర్తి వివరాలు ఇవే...

ABN , Publish Date - Feb 21 , 2026 | 01:16 PM

ఇటీవలే టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ క్రికెట్ ప్రియులకు ఫుల్ మీల్స్ పెట్టిందనే చెప్పవచ్చు. అయితే అలాంటి మరో మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి భారత్, పాకిస్థాన్ తలపడే విషయంపై క్రేజీ న్యూస్ వచ్చింది.

మళ్లీ భారత్, పాకిస్థాన్ మ్యాచ్! పూర్తి వివరాలు ఇవే...
India vs Pakistan

స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌లకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మ్యాచ్‌లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు. అలానే వ్యూయర్ షిప్ కూడా విపరీతంగా ఉంటుంది. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న భారత్, పాక్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ క్రమంలో మరోసారి ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ జరిగితే బాగుండని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. మరోసారి భారత్, పాక్ తలపడనున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...


అత్యంత ప్రతిష్టాత్మక క్రీడల్లో ఒకటైన ఆసియా క్రీడలు ఈ ఏడాది జరగనున్నాయి. జపాన్‌లో ఐచి-నగోయా నగరంలో ఈ క్రీడలను నిర్వహించనున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో భారత్, పాకిస్థాన్ మరోసారి తలపడనున్నాయని సమాచారం. ఈ క్రీడలకు పూర్తి స్థాయి పురుషులు, మహిళల క్రికెట్ జట్లను పంపడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే ఈ దాయాది దేశాలు మరోసారి మైదానంలో తలపడతాయి. ఆసియా క్రీడల్లో భాగంగా జరిగే క్రికెట్ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. మొత్తంగా ఇప్పటి వరకు మూడు సార్లు ఆసియా క్రీడల్లో క్రికెట్ విభాగాన్ని తీసుకొచ్చారు. ఆసియా అంతటా క్రికెట్‌కు ఉన్న ఆదరణ కారణంగా 2026 ఆసియా క్రీడల్లో‌కి మరోసారి తీసుకొచ్చారు . గతంలో 2010, 2014, 2023 ఆసియా క్రీడల్లో క్రికెట్ ను నిర్వహించారు.


2023లో హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాయి. పురుషుల టోర్నమెంట్‌లో ఆఫ్గానిస్థాన్ రజతం, మహిళలలో శ్రీలంక రజతం గెలిచింది. అలానే బంగ్లాదేశ్ రెండు విభాగాలలోనూ కాంస్యం గెలుచుకుంది. టీ20 ప్రపంచ కప్ 2026లో మరోసారి భారత్, పాక్ తలపడాలని అందరూ కోరుకుంటున్నారు. ఒకవేళ అది జరగకపోయినా.. అతి త్వరలో ఈ ఆసియా క్రీడల రూపంలో ఇండియా, పాక్ తలపడే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి:

సూపర్ 8 వేళ పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. మ్యాచ్ ఆడకుండానే..!

ఇక సూపర్‌ ఫైట్‌

Updated Date - Feb 21 , 2026 | 02:06 PM