Home » Team India
కోల్‌కతా వేదికగా బ్రెజిల్‌తో జరిగిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో భారత జాతీయ జట్టు 0-4 తేడాతో ఓటమి పాలైంది. ప్రపంచ దిగ్గజ జట్టు బ్రెజిల్ ఊహించినట్లుగానే మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
న్యూ చండీగఢ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్(129*)మెరుపు సెంచరీతో పాటు రోహిత్ శర్మ(92) రాణించడంతో టీమిండియా 351 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ నేపథ్యంలో..
ఆసియా క్రీడలు 2026లో భారత్, పాకిస్థాన్ జట్ల గోల్డ్ మెడల్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.
ఆసియా క్రీడలు 2026లో భాగంగా స్వర్ణ పతకం కోసం చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.
భారత గోల్ఫర్ ప్రణవి శరత్ ఉర్స్ ఆసియా క్రీడల్లో అద్భుతం చేసింది. మహిళల వ్యక్తిగత గోల్ఫ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.
ఆసియా గేమ్స్ 2026లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ స్వర్ణ పతకం కోసం పోటీ పడనున్నారు. ఈ క్రమంలో టాస్ నెగ్గిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది.
వన్డే ప్రపంచకప్ 2027పై భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న మెగా టోర్నీలో టీమిండియా సమతూకం సరిగ్గా ఉండాలంటే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య చాలా ముఖ్యమని పేర్కొన్నాడు.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. అయితే వన్డే ప్రపంచ కప్ 2027ను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఖరి మ్యాచ్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. దీనిపై భారత మాజీ క్రికెటర్ రహానె ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. వెస్టిండీస్‌తో రెండో వన్డేలో గిల్ రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.
ఆసియా క్రీడలు-2026లో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. దీంతో మ్యాచ్ రద్దయితే స్వర్ణ పతకం ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది.