టీ20 ప్రపంచ కప్ 2026: భారత్ చేతిలో పాక్ చిత్తు

ABN, Publish Date - Feb 16 , 2026 | 09:19 AM

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ నేరుగా సూపర్ 8కి క్వాలిఫై అయింది.

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఛేదనలో పాక్ ఆది నుంచి తడబడింది. భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. 18 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలారు. దీంతో భారత్ నేరుగా సూపర్ 8కి క్వాలిఫై అయింది.


ఇవి కూడా చదవండి:

భారత్, పాక్ మ్యాచ్.. ఇవాళ మధ్యాహ్నమే..

భారత్, పాక్ మ్యాచ్: వర్షం పడాలని కోరుకున్న పాక్ మాజీ ప్లేయర్

Updated at - Feb 16 , 2026 | 09:19 AM