Share News

భారత్, పాక్ మ్యాచ్.. ఇవాళ మధ్యాహ్నమే..

ABN , Publish Date - Feb 15 , 2026 | 10:52 AM

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇవాళ(ఆదివారం) భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

 భారత్, పాక్ మ్యాచ్.. ఇవాళ మధ్యాహ్నమే..
India vs Pakistan Women 2026

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇవాళ(ఆదివారం) భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాకిస్థాన్ జట్టుకు గట్టిగా బుద్ధి చెప్పాలనే కసితో టీమిండియా ఉంది. అలానే ప్రపంచకప్ లో భారత్ రికార్డును మరింత పటిష్ఠం చేయాలని సూర్య సేన భావిస్తోంది. ఇదే సమయంలో భారత్, పాక్ మ్యాచ్ ఇవాళ(ఫిబ్రవరి 15) మధ్యాహ్నం జరగనుంది. అయితే పురుషుల జట్టు కాదు. ‘ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ (ACC Women's Asia Cup Rising Stars 2026)’ టోర్నీలో ఇరుదేశాల మహిళల జట్లు తలపడనున్నాయి.


భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు దాయాది మహిళా జట్ల మధ్య మ్యాచ్‌ మొదలు అవుతుంది. బ్యాంకాక్‌లోని టెర్‌థాయ్‌ క్రికెట్‌ మైదానం వేదిగా ఈ చిరకాల ప్రత్యర్థులు తలపడన్నారు. కాగా మహిళా ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో గ్రూప్‌-ఏ లో భారత్‌-ఏ, పాకిస్థాన్‌-ఏ జట్లతో పాటు యూఏఈ, నేపాల్‌ తలపడుతున్నాయి. గ్రూప్‌-ఏలో ప్రస్తుతానికి పాక్‌, యూఏఈ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. భారత్‌, నేపాల్‌ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.


ఉమెన్స్ టీమిండియా సెమీ ఫైనల్ కు చేరాలంటే.. ఇవాళ పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ లో తప్పక గెలవాలి. కాగా భారత మహిళల సీనియర్‌ జట్టు‌ సభ్యురాలైన రాధా యాదవ్‌ కెప్టెన్సీలో భారత్‌-ఎ జట్టు ఈ టోర్నీలో బరిలోకి దిగింది. రాధా బృందంలో అనుష్క శర్మ, తేజల్‌ హసబ్నిస్, మిన్ను మణి, నందిని శర్మ వంటి ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్) స్టార్లు కూడా ఉన్నారు. ఈ మ్యాచ్‪ను సోనీ స్పోర్ట్స్‌ టీవీ నెట్‌వర్క్‌, సోనీ లైవ్‌ ఇండియాలో వీక్షించవచ్చు.


తుది జట్లు

భారత్-ఏ:

రాధా యాదవ్ (కెప్టెన్), హుమైరా కాజీ, బృందా దినేష్, తేజల్ హసబ్నిస్, అనుష్క శర్మ, మిన్ను మణి, మమతా మడివాలా (వికెట్ కీపర్), తనూజా కన్వెర్, ప్రేమ రావత్, సైమా ఠాకోర్, నందిని కశ్యప్, సోనియా మెంధియా, జింతీమణి షర్మా కలిత

పాకిస్థాన్-ఏ:

హఫ్సా ఖలీద్ (కెప్టెన్), యుస్రా అమీర్ (వికెట్ కీపర్), షావాల్ జుల్ఫికర్, హురైనా సజ్జాద్, గుల్ రుఖ్, నోరీన్ యాకూబ్, వహీదా అక్తర్, ఎమాన్ నసీర్, అనోషా నాసిర్, మోమినా రియాసత్, సయ్యదా మసూమా జహ్రా, ఉమ్మిన్-ఎ-హనీ, ల్హమినా ఖాన్


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచకప్2026: 96 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం

భారత్-పాక్ మ్యాచ్: టీమిండియాకు ఒకే ఒక్క ఓటమి.. అదెప్పుడంటే?

Updated Date - Feb 15 , 2026 | 11:08 AM