భారత్-పాక్ మ్యాచ్: టీమిండియాకు ఒకే ఒక్క ఓటమి.. అదెప్పుడంటే?
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:27 PM
ఆది నుంచి పాక్‌పై భారత్‌దే ఆధిపత్యం. సచిన్, ధోనీ, విరాట్ కోహ్లీ ఇప్పుడు సూర్య కుమార్ యాదవ్.. నాయకత్వంలో టీమిండియా అజేయంగా నిలుస్తూ వస్తోంది. కానీ టీ20 క్రికెట్‌లో ఒకే ఒక్క మ్యాచ్‌లో పాక్ విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తే. మ్యాచ్ ఉన్నంత సేపు టీవీలకు అతుక్కుపోతుంటారు అభిమానులు. తమ దేశం గెలవాలంటూ పూజలు కూడా చేస్తుంటారు. మరీ ముఖ్యంగా భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ మరెక్కడ ఉండదేమో అనిపిస్తుంటుంది. క్రికెట్‌ను ఓ ఆటలానే కాదు.. ఓ మతంలా చూస్తారు. 2001లో పార్లమెంట్‌పై ఉగ్రదాడి తర్వాత భారత జట్టు పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు కూడా ఆడటం ఆపేసింది. కేవలం ఈ ఇరు జట్లు ఐసీసీ టోర్నీలోనే తలపడుతున్నాయి.
అయితే ఆది నుంచి పాక్‌పై భారత్‌దే ఆధిపత్యం. సచిన్, ధోనీ, విరాట్ కోహ్లీ ఇప్పుడు సూర్య కుమార్ యాదవ్.. నాయకత్వంలో టీమిండియా అజేయంగా నిలుస్తూ వస్తోంది. కానీ టీ20 క్రికెట్‌లో ఒకే ఒక్క మ్యాచ్‌లో పాక్ విజయం సాధించింది. అదీనూ 10 వికెట్ల తేడాతో..! భారత్-పాక్ ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడింది. అందులో ఒకటి మాత్రమే పాకిస్థాన్ గెలిచింది.
అది 2021 అక్టోబర్ 24.. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్-పాక్ తలపడ్డాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(0), కేఎల్ రాహుల్(3) వెనువెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 8 బంతుల్లో 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి భారత్ స్కోర్ 36/3. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ(57), రిషభ్ పంత్(39) కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో 20 ఓవర్లలో టీమిండియా స్కోర్ 151/7.
152 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి పాకిస్థాన్.. అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 17.5 ఓవర్లలోనే వికెట్ కూడా కోల్పోకుండా ఆటను ముగించింది. ఓపెనర్లు బాబర్ ఆజం(68*), రిజ్వాన్(79*) అజేయంగా నిలిచారు. టీమిండియా పాక్‌పై తన తొలి ఓటమిని నమోదు చేసుకుంది. ఆ తర్వాత జరిగిన ఏ మ్యాచుల్లోనూ పాకిస్థాన్ గెలవలేకపోయింది.
ఇవి కూడా చదవండి:
భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్.. టీమిండియాదే విజయం: భజ్జీ
గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్ లాబీలో హార్దిక్ పాండ్య.. వీడియో వైరల్