భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్.. టీమిండియాదే విజయం: భజ్జీ
ABN , Publish Date - Feb 14 , 2026 | 01:03 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం భారత్-పాక్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్-పాక్ పోరులో టీమిండియా విజయ కేతనం ఎగురవేస్తుందని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం భారత్-పాక్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దీనికి కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదిక కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్-పాక్ పోరులో టీమిండియా విజయ కేతనం ఎగురవేస్తుందని తెలిపాడు. ఈ మేరకు రాంచీలో అతడు విలేకరుల సమావేశంలో మాట్లాడాడు.
‘పాక్‌తో మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా గెలుస్తుంది. పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్‌ను భారత బ్యాటర్లు సమర్థంగా ఎదుర్కొంటారు. టీమిండియాకు ఆ సత్తా ఉంది. భారత్ చాలా మంచి జట్టు. బలంగానూ ఉంది. నిత్యం ఆడుతున్నట్లే ఈ మ్యాచునూ ఆడుతారు. ఒత్తిడి లేకుండా మెరుగైన ప్రదర్శన చేసి విజయం కేతనం ఎగురవేస్తారు.
ప్రస్తుతం పాకిస్థాన్ మీదే తీవ్రమైన ఒత్తిడి ఉంది. పాకిస్థాన్ ఐసీసీ టోర్నమెంట్లలో ఏడు లేదా ఎనిమిది మ్యాచుల్లో వరుసగా ఓడిపోయింది. నాకు తెలిసి భారత్‌కు మరోసారి పాక్‌ను ఓడించడం అంతకష్టమేమీ కాదు. ప్రస్తుతం క్రికెట్ బాగా మారింది. ముఖ్యంగా భారత యువ క్రికెటర్లు ఫియర్‌లెస్ క్రికెట్ ఆడుతున్నారు’ అని భజ్జీ అన్నాడు.
ఇవి కూడా చదవండి:
2003 ప్రపంచ కప్ టోర్నీ.. సచిన్ ఆడిన ఆ నాక్ పాక్‌కు గుర్తుండిపోద్ది!
పదో తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ