Share News

పదో తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ

ABN , Publish Date - Feb 14 , 2026 | 10:09 AM

భారత క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తోన్న యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నవాడు. బిహార్‌లోని సమస్తిపుర్‌లోని పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో వైభవ్.. పరీక్షలకు హాజరుకానున్నాడు.

పదో తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ
Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తోన్న యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నవాడు. బిహార్‌లోని సమస్తిపుర్‌లోని పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో వైభవ్.. పరీక్షలకు హాజరుకానున్నాడు. ఈ విషయంపై స్కూల్ ప్రిన్సిపల్ నీల్ కిశోర్ మాట్లాడారు.


‘ఫిబ్రవరి 17 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఇది క్రికెట్ మైదానం కాదు.. అకాడెమిక్ పిచ్. అందరి విద్యార్థుల్లాగానే వైభవ్ కూడా పరీక్షలు రాయనున్నాడు. అయితే వైభవ్ క్రికెటర్ కాబట్టి.. అందుకు తగ్గట్లుగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇతర విద్యార్థులకు పరీక్షలు రాయడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం’ అని ప్రిన్సిపల్ వెల్లడించారు.


అండర్ 19 ప్రపంచ కప్ 2026లో వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. హరారే వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్‌లో 15 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి అదరహో అనిపించాడు. అండర్19 వరల్డ్‌ కప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక గతేడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ తరఫు ఆడిన ఈ బిహార్ కుర్రాడు.. 35 బంతుల్లోనే సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్ 2026: జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా చిత్తు

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Updated Date - Feb 14 , 2026 | 10:09 AM