టీ20 ప్రపంచ కప్ 2026: జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా చిత్తు
ABN , Publish Date - Feb 13 , 2026 | 02:53 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పరాజయం పాలైంది. 170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 19.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పరాజయం పాలైంది. 170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 19.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. దీంతో జింబాబ్వేపై 23 పరుగుల తేడాతో ఓటమిని చవి చూసింది.
ఆస్ట్రేలియా బ్యాటర్లలో మ్యాట్ రెన్‌షా(65; 44 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేసినా జట్టుకు పరాజయం తప్పలేదు. గ్లెన్ మ్యాక్స్‌వెల్(31) పర్వాలేదనిపించాడు. వీరు మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. ఇంగ్లీస్(8), హెడ్(17), గ్రీన్(0), టిమ్ డేవిడ్(0), స్టాయినీస్(6), బెన్(6) తీవ్రంగా విఫలమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో ముజారబని 4 వికెట్లు, బ్రాబ్ ఎవాన్స్ 3 మూడు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించారు. ర్యాన్ బురి, వెల్లింగ్టన్ చెరొక వికెట్ తీశారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. బెన్నెట్(64) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మారుమణి(35), ర్యాన్(35), సికందర్ రాజా(25*) రాణించారు. ఆసీస్ బౌలర్లలో గ్రీన్, స్టాయినీస్ చెరొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో అర్ష్‌దీప్ సింగ్
కొలంబో పిచ్‌ను టీమిండియాకు అనుకూలంగా మార్చేస్తారు.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..