చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Feb 13 , 2026 | 01:41 PM
ఆర్సీబీ అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు కర్ణాటక మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు కర్ణాటక మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెటింగ్, ప్రేక్షకుల నియంత్రణ, స్టేడియం యాక్సెస్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ.. జస్టిస్ జాన్ మైకెల్ డి కున్హా నివేదికలను అమలు చేస్తామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
‘కర్ణాటక, బెంగళూరులోని క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. క్రికెట్, అభిమానుల ప్రయోజనాల దృష్ట్యా ప్రజా భద్రతకు అత్యంత ప్రాధానమిస్తూ చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడానికి అనుమతించాలని మంత్రి వర్గం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. టికెటింగ్, జనసమూహ నియంత్రణ, స్టేడియం యాక్సెస్‌పై నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ జస్టిస్ జాన్ మైకెల్ డి కున్హా నివేదిక సిఫార్సులను అమలు చేస్తారు. బాధ్యత, జవాబుదారీతనంతో మేం ముందుకు సాగుతాం’ అని డీకే శివకుమార్ పేర్కొన్నారు. అయితే గరిష్ఠంగా 35,000 మంది ప్రేక్షకులనే మైదానంలోకి అనుమతించనున్నారు.
17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 4న చిన్నస్వామి స్టేడియం వద్ద నిర్వహించిన విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాన్ డి కున్హా నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ వేసింది.
ఇవి కూడా చదవండి:
అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో అర్ష్‌దీప్ సింగ్
కొలంబో పిచ్‌ను టీమిండియాకు అనుకూలంగా మార్చేస్తారు.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..