Home » IPL
సీఎస్కే కొత్త హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ స్టార్ పేసర్ జహీర్ ఖాన్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే జహీర్ ఎంపికకు ముందు పలువురు మాజీ క్రికెటర్ల పేర్లను సీఎస్కే యాజమాన్యం పరిశీలించినట్లు భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు.
ఐపీఎల్ 2027 వేలానికి వేదిక ఖరారైంది. ఈసారి వేలాన్ని భారత్‌లోనే నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో గోవా వేదికగా మెగా వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని సీఎస్కే తన ఎక్స్ ఖాతా వేదికగా ప్రకటించింది.
ఐపీఎల్ 2027 మినీ వేలానికి సంబంధించిన కీలక నిర్ణయం వెలువడింది. వచ్చే సీజన్‌కు ముందు నిర్వహించే మినీ వేలాన్ని భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
వెస్టిండీస్‌తో భారత్ స్వదేశంలో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. దీనికి టీమిండియా జట్ల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. బుధవారం జాతీయ సెలెక్షన్ కమిటీ రెండు ఫార్మాట్లకు జట్లను ఎంపిక చేయనుంది.
భారత జట్టులో రీఎంట్రీపై సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను భారత్ తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే జట్టులో చోటు కోసం గతంలో మాదిరి ఎదురుచూడటం లేదని స్పష్టం చేశాడు.
ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చాడు. ఢిల్లీ నుంచి రాహుల్ ట్రేడ్ అవుతాడంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ రూమర్లకు తాజాగా అతడు చెక్ పెట్టాడు.
ఐపీఎల్ 2027కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో హెడ్ కోచ్ ఎంపికపై సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొత్త కోచ్‌ను నియమించడానికి ఇంకా చాలా సమయం ఉందని, అప్పుడే తొందరెందుకని తెలిపాడు.
ఐపీఎల్‌లో కొన్నేళ్లుగా తీవ్ర చర్చకు దారితీస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై బీసీసీఐ మరోసారి పునరాలోచనకు సిద్ధమవుతోంది. ఐపీఎల్-2027 సీజన్‌కు ముందు ఈ నిబంధనపై పది ఫ్రాంచైజీల నుంచి తాజాగా అభిప్రాయాలు సేకరించాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఐపీఎల్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని ఇచ్చిన విలువైన సలహాలు పని చేశాయని భారత పేసర్ యశ్ ఠాకూర్ గుర్తు చేసుకున్నాడు.