Share News

ఐపీఎల్ 2026: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్

ABN , Publish Date - Feb 13 , 2026 | 05:26 PM

ఐపీఎల్ 2026 సమరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ కెప్టెన్‌ను ప్రకటించింది. యువ ప్లేయర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్‌లో ఆర్ఆర్‌కు నాయకత్వం వహించనున్నాడు.

ఐపీఎల్ 2026: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్
IPL 2026

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సమరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా పలు ఫ్రాంచైజీల్లో పలు కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ కెప్టెన్‌ను ప్రకటించింది. యువ ప్లేయర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్‌లో ఆర్ఆర్‌కు నాయకత్వం వహించనున్నాడు. ఈ మేరకు జట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.


అయితే ఐపీఎల్ 2026 వేలంలో ఇప్పటి వరకు రాజస్థాన్‌కు కెప్టెన్‌గా ఉన్న సంజు శాంసన్.. చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రేడ్ ద్వారా వెళ్లిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించిన రవీంద్ర జడేజా ఆర్ఆర్‌కు వెళ్లగా.. సంజు చెన్నైకి వచ్చాడు. అయితే జడేజా, యశస్వి జైస్వాల్‌లలో ఒకరికి కెప్టెన్‌గా అవకాశం వస్తుందని క్రికెట్ వర్గాలు అంచనా వేశాయి. అనూహ్యంగా రియాన్ పరాగ్‌కు ఛాన్స్ దక్కింది. గత సీజన్‌లోనూ సంజుకు బదులు రియాన్ పలు మ్యాచుల్లో జట్టును నడిపించిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్ 2026: జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా చిత్తు

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Updated Date - Feb 13 , 2026 | 05:35 PM