Share News

అభిషేక్ శర్మ హెల్త్ అప్‌డేట్‌.. వీడియో విడుదల చేసిన అర్ష్‌దీప్ సింగ్

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:53 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్ హెల్త్ అప్‌డేట్‌పై యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశాడు.

అభిషేక్ శర్మ హెల్త్ అప్‌డేట్‌.. వీడియో విడుదల చేసిన అర్ష్‌దీప్ సింగ్
Abhishek Sharma

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని బుధవారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కానీ గురువారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడలేదు. ఈ నేపథ్యంలో అతడి హెల్త్ అప్‌డేట్‌పై యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశాడు.


ఆ వీడియోలో అభిషేక్ శర్మ మాట్లాడాడు. ‘ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. అయితే కొన్ని కేజీల బరువు మాత్రం తగ్గిపోయాను’ అని అన్నాడు. కాగా ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదకగా భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసందే. ఇందులో అభిషేక్ శర్మ ఆడుతాడా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా నమీబియాతో మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విషయంపై మాట్లాడాడు. అభిషేక్ మరో ఒకటి, రెండు మ్యాచ్‌లకు దూరం అయ్యే అవకాశం ఉందని తెలిపాడు.


ఇదిలా ఉండగా.. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. అభిషేక్ శర్మ హెల్త్ అప్‌డేట్‌పై స్పందించాడు. అతడు ప్రస్తుతం బాగానే ఉన్నాడని.. ప్రాక్టీస్ సైతం చేశాడని తెలిపాడు. భారత్-పాక్ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉందని తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్ 2026: జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా చిత్తు

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Updated Date - Feb 13 , 2026 | 04:57 PM