Share News

గతంలో జోక్స్‌తోనే కాలక్షేపం చేసేవాడిని.. ఇప్పుడలా కాదు: ఇషాన్ కిషన్

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:03 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ అంశంపై అతడు మాట్లాడాడు. గతంలో జోక్స్‌తోనే కాలక్షేపం చేసేవాడినని.. ఇప్పుడు అంతా మారిందని తెలిపాడు.

గతంలో జోక్స్‌తోనే కాలక్షేపం చేసేవాడిని.. ఇప్పుడలా కాదు: ఇషాన్ కిషన్
Ishan Kishan

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌తో అదరగొడుతున్నాడు. దాదాపు రెండేళ్లు భారత జట్టుకు దూరంగా ఇషాన్.. దేశవాళీల్లో రాణిస్తూ రీఎంట్రీ ఇచ్చాడు. న్యూజిలాండ్‌తో టీ20 నుంచి మంచి ప్రదర్శనలు చేస్తుండటంతో టీ20 ప్రపంచ కప్ 2026లోనూ చోటు దక్కింది. తాజాగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 24 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఇషాన్ మాట్లాడాడు.


‘నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు మారిపోయాను. ఎందుకంటే నాకు జోకులంటే చాలా ఇష్టం. గతంలో నేను 24 గంటలు జోక్స్‌తోనే కాలక్షేపం చేసేవాడిని. కానీ ఇప్పుడు ఆ సమయాన్ని రెండు, మూడు గంటలకు తగ్గించాను. ప్రస్తుతం బ్యాటింగ్, నా వికెట్ కీపింగ్ మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నాను. ఇది జట్టుకు, నాకు ఎంతో ప్రయోజనకరం. క్రికెట్ తర్వాతే ఏదైనా’ అని ఇషాన్ అన్నాడు.


పాక్‌ను ఎదుర్కోవడానికి సిద్ధం

ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్-పాక్ తలపడనున్నాయి. కాగా పాక్ బౌలర్ ఉస్మాన్ తారిక్ విచిత్రమైన యాక్షన్ బౌలింగ్‌పైనే ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఈ విషయంపై కూడా ఇషాన్ మాట్లాడాడు. ‘మేం ఉస్మాన్ తారిక్ బౌలింగ్‌‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేం బంతిని చూస్తూ.. మా సహజసిద్ధమైన ఆటను ఆడాల్సిన సమయం వచ్చింది. మేం స్కోర్ బోర్డు మీద మంచి టోటల్ ఉంచాలనుకుంటున్నాం. కొన్ని వీడియోలు చూడటంతో అతడి బౌలింగ్ మీద మాకో అవగాహన వచ్చింది’ అని ఇషాన్ అన్నాడు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్ 2026: జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా చిత్తు

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Updated Date - Feb 13 , 2026 | 03:55 PM