Home » Arshdeep Singh
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోన్న తరుణంలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. టీమిండియాకు ఓ కీలక సూచన చేశాడు. భారత్ ఈ మెగా టోర్నీలో కచ్చితంగా ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. రాయ్‌పుర్ వేదికగా జరిగిన రెండో టీ20 సందర్భంగా కామెంట్రీలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
భారత్-న్యూజిలాండ్ జట్లు ఇండోర్ వేదికగా ఆఖరి వన్డే మ్యాచులో తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఏకంగా 337 పరుగులు చేసింది.
టీమిండియా వెటరన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఏ పని చేసినా ఇట్టే వైరల్ అయిపోతుంటుంది. విరాట్‌కు ఓ అలవాటు ఉంది.. తోటి ఆటగాళ్లను ఎప్పుడూ ఆటపట్టిస్తూ వాళ్లను ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. తాజాగా విరాట్.. టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ రన్నింగ్ స్టైల్‌ను ఇమిటేట్ చేశాడు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపుర్ వేదికగా సిక్కింతో జరిగిన మ్యాచులో పంజాబ్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ తరఫున బరిలోకి దిగిన టీమిండియా యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ విజృంభించడంతో సిక్కిం జట్టు విలవిల్లాడింది. కేవలం 22.2 ఓవర్లకే ఆ జట్టు కుప్పకూలింది.
డిసెంబర్ 24 నుంచి దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ టోర్నీలో స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడుతున్నట్లు తెలిసిందే. ఇప్పుడు మరో ముగ్గురు ఈ జాబితాలో చేరారు.
ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. యువ పేసర్ అర్ష్‌దీప్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఓ వికెట్ విషయంలో సూర్యకుమార్ లేట్‌గా రివ్యూ తీసుకోవడంపై అర్ష్‌దీప్ తాజాగా స్పందించాడు.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. బుమ్రాపై సరదా వ్యాఖ్యలు చేశారు. తనతో రీల్ చేయాలంటే బుమ్రా ఇంకా ఎక్కువ వికెట్లు పడగొట్టాలని తెలిపాడు.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్టార్ పేసర్ బుమ్రా ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. మూడు ఫార్మాట్లలో వంద వికెట్లు తీసుకున్న తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ గెలిచిన తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చేసిన రీల్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఒక్క రోజులోనే ఈ రీల్ 10 కోట్ల వ్యూస్ అందుకోవడం విశేషం.
సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ గెలిచాక కోహ్లీ-అర్ష్‌దీప్ సింగ్ ఫన్నీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.