Share News

Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న మరో ముగ్గురు స్టార్ ప్లేయర్లు!

ABN , Publish Date - Dec 22 , 2025 | 03:40 PM

డిసెంబర్ 24 నుంచి దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ టోర్నీలో స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడుతున్నట్లు తెలిసిందే. ఇప్పుడు మరో ముగ్గురు ఈ జాబితాలో చేరారు.

Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న మరో ముగ్గురు స్టార్ ప్లేయర్లు!
Vijay Hazare Trophy

ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఇప్పటికే టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో మరో ముగ్గురు స్టార్ ప్లేయర్లు చేరారు. ఈ టోర్నీ(Vijay Hazare Trophy) కోసం పంజాబ్ 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. టీమిండియా ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, అర్ష్‌దీప్ సింగ్, అభిషేక్ శర్మలకు ఇందులో అవకాశం కల్పించారు. వికెట్ కీపర్, బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో పాటు ఆల్‌రౌండర్లు నమన్ ధీర్, అన్మోల్ ప్రీత్ సింగ్, రమణ్ దీప్ సింగ్, సన్వీర్ సింగ్‌ను ఎంపిక చేశారు. అయితే కెప్టెన్ ఎవరనేది మాత్రం వెల్లడించలేదు.


పంజాబ్ తమ ఏడు లీగ్ దశ మ్యాచ్‌లను జైపూర్‌లో ఆడనుంది. ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, గోవా, ముంబైతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లు జనవరి 8న ముగుస్తాయి. జనవరి 11 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో గిల్, అభిషేక్, అర్ష్‌దీప్ ఎంపికైతే.. విజయ్‌ హజారే ట్రోఫీకి వారు ఎన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారో చూడాలి.


విజయ్ హజారే ట్రోఫీకి పంజాబ్ జట్టు:

శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్‌ కీపర్), హర్నూర్ పన్ను, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉదయ్ సహారాన్, నమన్ ధీర్, సలీల్ అరోరా, సన్వీర్ సింగ్, రమణ్‌దీప్ సింగ్, జషన్‌ప్రీత్ సింగ్, గుర్నూర్ బ్రార్, హర్‌ప్రీత్ బ్రార్, రఘు శర్మ, క్రిష్ భగత్, గౌరవ్ చౌదరి, సుఖదీప్ బజ్వా.


ఇవీ చదవండి:

జట్టు ఎంపిక అద్భుతం.. గిల్‌ను తొలగిస్తారని అస్సలు ఊహించలేదు.. భారత మాజీ కెప్టెన్

అది నా ఫేవరెట్ షాట్.. తన ఫామ్‌పై జెమీమా స్పందనిదే!

Updated Date - Dec 22 , 2025 | 03:40 PM