Home » Abhishek Sharma
భారత విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20 క్రికెట్‌లో ఏకంగా 10 సార్లు డకౌట్ అయిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ దూకుడు ప్రదర్శించాడు. పాకిస్థాన్ బ్యాటర్ ఫర్హాన్‌ను వెనక్కి నెట్టి మళ్లీ రెండో స్థానానికి ఎగబాకాడు.
భారత స్టార్ యువ ప్లేయర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు.షేర్-ఏ-పంజాబ్ టీ20 లీగ్‌లో ఫజిల్కా ఫాల్కన్స్, అమృత్‌సర్ సూర్మాస్ మ్యాచ్‌లో ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు నడిచింది.
టీమిండియా ఓపెనింగ్ కాంబినేషన్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా స్పందించారు. ఇప్పటి వరకు ప్రయత్నించని సంజు-వైభవ్ కాంబినేషన్‌ను పరిశీలించాలని టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.
పంజాబ్ క్రికెట్ సంఘం (పీసీఏ) ఆధ్వర్యంలో తొలిసారిగా జరగనున్న షేర్-ఇ-పంజాబ్ టీ20 లీగ్‌కు స్టార్ క్రికెటర్లు సిద్ధమయ్యారు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యువ సంచలనం అభిషేక్ శర్మలను అధికారులు మార్కీ ప్లేయర్లుగా ప్రకటించారు.
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. స్థానికంగా జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో అమృత్‌సర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ తరన్ తారన్ మెన్స్ సీనియర్ జట్టుపై 91 బంతుల్లో 233 పరుగులతో చెలరేగాడు.
విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు. జింబాబ్వే పర్యటనలో టీమిండియా సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినప్పటికీ.. ఓపెనర్ అభిషేక్ మాత్రం విఫలమయ్యాడు. దీంతో టీ20 జట్టులో అతడి స్థానంపై మరోసారి చర్చ మొదలైంది.
భారత క్రికెట్‌లో దూకుడైన బ్యాటింగ్‌కు కొత్త నిర్వచనాన్ని ఇస్తోన్న ఆటగాళ్ల గురించి మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హాలివుడ్ చిత్రం ‘టెర్మినేటర్’ సిరీస్‌తో పోలుస్తూ తనను తాను టెర్మినేటర్‌గా అభివర్ణించుకున్నాడు.
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు టెన్నిస్ ప్రపంచానికి కూడా విస్తరించింది. ఆదివారం జరిగిన వింబుల్డన్ 2026 పురుషుల సింగిల్స్ ఫైనల్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన వైభవ్.. కొత్త లుక్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను ఒక మ్యాచ్ ఉండగానే భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో భారత ప్లేయర్ల ప్రదర్శనపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆటతీరును బోర్డు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.