Abhishek Sharma: వాళ్లిద్దరికీ ఆ సత్తా ఉంది.. సూర్య, గిల్‌కు అభిషేక్ శర్మ మద్దతు
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:12 AM
టీమిండియా స్టార్ బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. వీరి ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ వీరికి మద్దతుగా నిలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన చేస్తున్నారు. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లోనూ వీరిద్దరూ విఫలమయ్యారు. ఇప్పటికే సూర్య, గిల్‌పై క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ వీరిద్దరికీ మద్దతుగా నిలిచాడు. మూడో టీ20లో గెలిచిన అనంతరం అభిషేక్(Abhishek Sharma) ప్రెస్‌మీట్‌లో మాట్లాడాడు.
‘నన్ను నమ్మండి.. సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav), శుభ్‌మన్ గిల్ ఇద్దరూ టీ20 ప్రపంచ కప్‌లో భారత్ మ్యాచులను గెలిపిస్తారు. వారికి ఆ సత్తా ఉంది. ప్రపంచ కప్‌కు ముందు కూడా కీలక ఇన్నింగ్స్ ఆడతారు. గిల్(Shubman Gill)తో చాలాకాలంగా కలిసి ఆడుతున్నాను. అతను ఏ పరిస్థితుల్లో, ఎలాంటి పిచ్‌లపై రాణించగలడో నాకు బాగా తెలుసు. అతనిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. త్వరలోనే అందరికీ అతడిపై నమ్మకం కలుగుతుంది’ అని అభిషేక్ శర్మ వెల్లడించాడు.
టీ20ల్లో ప్రస్తుతం సూర్య, గిల్ ఇద్దరూ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడాది సూర్య కేవలం 213 పరుగులు మాత్రమే చేశాడు. గిల్ కూడా ఈ ఏడాది 291 పరుగులే చేశాడు. గత సెప్టెంబర్‌లో ఓపెనర్‌గా వచ్చినప్పట్నుంచి ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు.
దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో కూడా గిల్ దూకుడుగా ఆడలేకపోయాడు. బ్యాటింగ్ చేయడంలో ఇబ్బందిపడినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఎంతోసేపు క్రీజులో ఉన్నా 28 పరుగులకే ఔటయ్యాడు. ఇక సూర్యకుమార్(12) ఎప్పటిలాగే బౌండరీలు కొట్టి పెవిలియన్‌కు చేరాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ వీరిద్దరూ విఫలమవ్వడం, స్వదేశంలో త్వరలోనే టీ20 ప్రపంచకప్ ప్రారంభమవుతుండటంతో వీరిపై ఒత్తిడి పెరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
నేను ఫామ్ కోల్పోలేదు: భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్య.. తొలి భారత ప్లేయర్‌గా!